ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2020-06-01T10:46:04+05:30 IST

మండలంలోని చినబూరాడపేట గ్రామంలో విజయనగరం తిరుమల ఆసుపత్రి, రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

నెల్లిమర్ల, మే 31: మండలంలోని చినబూరాడపేట గ్రామంలో విజయనగరం తిరుమల ఆసుపత్రి, రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. పరిసర గ్రామాలకు చెందిన సుమారు 320 మందికి గుండె, ఎముకలకు సంబంధించి వైద్య సేవలు అందించారు. 221 మందికి ఉచితంగా బీపీ,  షుగర్‌ పరీక్షలు చేశారు. అలాగే 41 మందికి ఈసీజీ తీశారు. ఈ శిబిరానికి తిరుమల ఆసుపత్రి వైద్యులు వెంకటరావు, శివప్రసాద్‌, వేదావతి తదతరులు హాజరై రోగులను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మారుతి యువజన సేవా సంఘం అధ్యక్షుడు బెల్లాన రామారావుతో పాటు ప్రతినిధులు దగ్గరుండి సహాయ సహకారాలు అందించా రు. శిబిరాన్ని తిరుమల ఆసుపత్రి పీఆర్వో కేవీ మురళీధరరావు పర్యవేక్షించారు.

Updated Date - 2020-06-01T10:46:04+05:30 IST