సక్రమంగా భోజన పథకం అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST

మధ్యాహ్న భోజనం పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం సంచాలకుడు దివాన్‌ మైధీన్‌ అన్నారు.

సక్రమంగా భోజన పథకం అమలు చేయాలి

కురుపాం, ఫిబ్రవరి: మధ్యాహ్న భోజనం పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం సంచాలకుడు దివాన్‌ మైధీన్‌ అన్నారు. ఈ నెల 19న కురుపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యా హ్న భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపిన ఘటనపై శుక్రవా రం ఆయన విచారణ జరిపారు. భోజనాల విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పాత వంటవారిని తొలగించామని, కొత్త వారితో వంటలు చేయిస్తున్నామని, బాగా వండితే వీరినే కొనసాగిస్తామని తెలిపా రు. భోజన పథకాన్ని జగనన్న గోరు ముద్దలు యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లా మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరుణ జ్యోతి, ఎంఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

పార్వతీపురంటౌన్‌: విద్యార్థులకు సక్రమంగా మెనూ అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మధ్యాహ్న భోజన పథక డైరెక్టర్‌ దివాన్‌ మైధీన్‌ అన్నారు. పట్టణంలోని కొత్తవలస కేపీఎం ఉన్నత పాఠశాల లో ప్రధానో పాధ్యా యుడు అప్పలనాయుడుతోపాటు మధ్యాహ్న భోజన నిర్వహకులతో ఆయన మాట్లా డారు.  పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టాలని కోరుతూ ఈనెల 24 నవిద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేసిన విషయం మధ్యాహ్న భోజన పథక డైరెక్టర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన డీఈవో కార్యాలయ ఏడీ జ్యోతికుమారితో కలిసి మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో  పాఠ శాలను పరిశీలించారు. నిర్వహకుల తీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజన అమలుపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపాలని ఆదేశించారు. 

గరుగుబిల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని రాష్ట్ర పథకం డైరెక్టర్‌ దివాన్‌ మైధీన్‌ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ అమలు చేయాలన్నారు. నిర్వహణపై విధిగా తనిఖీలు చేయాలని ఎంఈవో ఎన్‌.నాగభూషణరావును సూచించారు. పథకం నిర్వహణపై విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశీలనలో ప్రధానో పాధ్యాయుడు జయప్రకాష్‌ జోషఫ్‌ ఉన్నారు.


Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST