ఒక్కరోజే సెంచరీ!

ABN , First Publish Date - 2020-07-08T11:08:13+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాను వణికించేస్తోంది. రికార్డు స్థాయిలో మంగళవారం ఒక్కరోజే వంద కేసులు నమోదయ్యాయి.

ఒక్కరోజే సెంచరీ!

రికార్డు స్థాయిలో 100 కేసుల నమోదు

నెల్లూరులోనే అత్యధికంగా 59..


నెల్లూరు(వైద్యం)జూలై 7 : కరోనా మహమ్మారి జిల్లాను వణికించేస్తోంది. రికార్డు స్థాయిలో మంగళవారం ఒక్కరోజే వంద కేసులు నమోదయ్యాయి.  వీటిలో నెల్లూరు నగరంలోనే అత్యధికంగా 59 కేసులు రికార్డుకెక్కాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1170కి చేరుకుంది.నెల్లూరులోని సంతపేటలో 15, వేదాయపాళెంలో 8, దర్గామిట్టలో 5, పొదలకూరు రోడ్డులో 4, డైకాస్‌రోడ్డులో 3, కపాడిపాళెంలో 3, బుజబుజనెల్లూరులో 2, యడ్లవారివీధిలో 2, బీవీనగర్‌లో 2, కోటమిట్టలో 2, రేబాలవీధిలో 1, పద్మావతి సెంటర్‌లో 1, మూలాపేటలో 1, వనంతోపులో 1, చిల్డ్రన్‌పార్క్‌లో 1, పడారుపల్లిలో 1, హౌసింగ్‌బోర్డులో 1, డోనిపర్తివారివీధిలో 1, జెండావీధిలో 1, పాతజూబ్లీ ఆసుపత్రి రోడ్డులో 1, రామ్‌నగర్‌లో 1, కోవూరులో 1, గంగవరంలో 1, నాయుడుపేటలో 1, గూడూరులో 4, వెంకటగిరిలో 8. బాలాయపల్లిలో 1, ముత్తుకూరులో 1, చిల్లకూరులో 2, తడ మండలం చీలిగుంటలో 4, కావలిలో 4, సంగం మండలం సిద్దీపురంలో 1, బోగోలు మండలం కందనూతలలో 1, దగదర్తిలో 1, సూళ్లూరుపేట మండలం వట్రపాళెంలో 1, బంగోలుకు చెందినవారు 5, కడపకు చెందినవారు 2, చిత్తూరుకు చెందిన వారు 1, గుంటూరుకు చెందినవారు 1, శ్రీకాకుళంకు చెందినవారు 1, కడపకు చెందినవారు ఇద్దరు పాజిటివ్‌ కేసుల జాబితాలో ఉన్నారు. కాగా, జీజీహెచ్‌లో కరోనాతో కోలుకున్న 22 మంది, హోం ఐసోలేషన్‌లో ఉన్న 13 మంది  డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2020-07-08T11:08:13+05:30 IST