బక్కనికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-07-20T04:42:49+05:30 IST

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉమ్మడి పాలమూరు వాసిని వరించింది. ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిగా పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి నియ మితులవగా, తాజాగా టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇదే ప్రాంతానికి చెందిన బక్కని నరసింహులుకు దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బక్కనికి అరుదైన గౌరవం
బక్కని నరసింహులు

టీడీపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగింత


 మహబూబ్‌నగర్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉమ్మడి పాలమూరు వాసిని వరించింది. ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిగా పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి నియ మితులవగా, తాజాగా టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇదే ప్రాంతానికి చెందిన బక్కని నరసింహులుకు దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షాద్‌నగర్‌ మా జీ ఎమ్మెల్యేగా, టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పని చేసిన బక్కని నరసింహులును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తు తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డి గూడకు చెందిన బ క్కని నరసింహులు అంచెలంచెలుగా ఎదిగారు. బాల్య దశ నుంచే వివేకానందుని బోధనలను అనుసరిస్తూ ఎదిగారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యు డిగానూ ఒక పర్యాయం పని చేశారు. అంకితభావం గల నేతగా పేరు సాధించారు. పొత్తుల్లో భాగంగా రెండు పర్యాయాలు పోటీ చేసే అవకాశాలు కోల్పోయునా, పార్టీకి విధేయునిగా పని చేశారని కార్యకర్తల్లో పేరుంది. 2014 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనందున జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రఽధాన కార్యదర్శిని లోకేశ్‌ను కలిశారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తానని చెప్పారు.

Updated Date - 2021-07-20T04:42:49+05:30 IST