చంద్రశేఖర్‌కు అరుదైన అవకాశం

ABN , First Publish Date - 2020-12-06T04:48:41+05:30 IST

జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర సమన్వయకర్తగా సాలూరు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జోగ చంద్రశేఖర్‌ను నియమిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన రీసెర్చ్‌ ఎండ్‌ ట్రైనింగ్‌ (ఎనసీఈఆర్‌టీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రశేఖర్‌కు అరుదైన అవకాశం
భౌతిక శాస్త్ర సమన్వయకర్తగా చంద్రశేఖర్‌

జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర సమన్వయకర్తగా నియామకం

విజయనగరం రూరల్‌, డిసెంబరు 5: జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర సమన్వయకర్తగా సాలూరు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జోగ చంద్రశేఖర్‌ను నియమిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన రీసెర్చ్‌ ఎండ్‌ ట్రైనింగ్‌ (ఎనసీఈఆర్‌టీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ నుంచి ఆయన ఒక్కరికే అవకాశం లభించింది. ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు భౌతిక శాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించడం.. వివిధ ప్రయోగాలు, కొత్త అంశాలపై విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాన్ని పరిశీలించి వాటిని రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపడం.. భౌతికశాస్త్ర శాస్త్రవేత్తలతో విద్యార్థులకు విజ్ఞాన అంశాలపై టూర్స్‌ను ఏర్పాటు చేయడం.. శాస్త్రవేత్తల నుంచి మరిన్ని కొత్త అంశాలను విద్యార్థులు నేర్చుకునేవిధంగా ప్రోత్సహించడం భౌతిక శాస్త్ర సమన్వయకర్త బాధ్యత. జాతీయ స్థాయి భౌతిక శాస్త్ర సమన్వయకర్తగా నియమితులైన జోగ చంద్రశేఖర్‌ను సాలూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.రాధాకృష్ణ, అధ్యాపకులు చంటిబాబు, సహదేవుడు, జ్వాలాముఖి, విజయభారతి తదితరులు అభినందించారు. 


Updated Date - 2020-12-06T04:48:41+05:30 IST