మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రిలో అరుదైన మోకాలి శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2022-07-02T05:06:00+05:30 IST

గతంలో మోకాలి ఆపరేషన్‌ చేయించుకుని మోకాలి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి అరుదైన మోకాలి శస్త్రచికిత్స నిర్వహించి కృత్రిమంగా మోకీలును అమర్చినట్లు మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ ఇన్‌చార్జి, జాయింట్‌ రీప్లేస్‌ మెంట్‌ సర్జన్‌ వైద్యుడు కిషోర్‌ తెలిపారు.

మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రిలో అరుదైన మోకాలి శస్త్రచికిత్స
వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు కిషోర్‌, ఆనంద్‌రాజులు

సిద్దిపేట టౌన్‌, జూలై 1: గతంలో మోకాలి ఆపరేషన్‌ చేయించుకుని మోకాలి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి అరుదైన మోకాలి శస్త్రచికిత్స నిర్వహించి కృత్రిమంగా మోకీలును అమర్చినట్లు మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ ఇన్‌చార్జి, జాయింట్‌ రీప్లేస్‌ మెంట్‌ సర్జన్‌ వైద్యుడు కిషోర్‌ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూల్మిట్ట మండలం లింగపూర్‌కు చెందిన బాల్‌రాజు (35) పదేళ్ల క్రితం ఎడమకాలు మోకాలికి గాయమవ్వడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడన్నారు. కానీ మోకీలు సరిగ్గా చికిత్స కాలేదు. దీంతో మెడికేర్‌ రీచ్‌ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించాడన్నారు. సిద్దిపేటలో మొదటిసారిగా పోస్ట్‌ట్రామాటిక్‌ సెకండరీ ఆర్థరైటిస్‌ మోకీలు రీప్లేస్‌ మెంట్‌ చేసి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన కృత్రిమ కీలును అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జనరల్‌ సర్జన్‌ ఎం.త్రివిక్రమ్‌, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ వల్లకాటి రాజనీష్‌, మహే్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:06:00+05:30 IST