చెవిలో పూలతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-07-28T05:03:48+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పి విస్మరించిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుయువత వినూత్నంగా నిరసన తెలిపింది.

చెవిలో పూలతో ర్యాలీ
నిరసన తెలియజేస్తున్న తెలుగు యువత


విజయనగరంలో తెలుగు యువత వినూత్న నిరసన

విజయనగరం రూరల్‌, జూలై 27
: జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పి విస్మరించిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుయువత వినూత్నంగా నిరసన తెలిపింది. విజయనగరంలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు బుధవారం చెవిలో పూలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఎన్నో వరాలు ఇచ్చారని, ముఖ్యంగా జాబ్‌ క్యాలెండర్‌ని విడుదల చేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో కూడిన నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు జి.సురేంద్ర, గంటా రవి, పిన్నింటి కిషోర్‌, పి.సత్యనారాయణ, పి.రాజేష్‌, మంత్రి గోవింద, గేదేల రవీంద్రకుమార్‌, పాలూరి రాజనాయుడు, కర్రోతు పైడిరాజు, కుటుంబరావు, మాతా బుజ్జి, కోదండరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-28T05:03:48+05:30 IST