ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ

ABN , First Publish Date - 2022-09-30T05:14:51+05:30 IST

మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ
నీట మునిగిన జొన్నపంట

భారీ వర్షంతో లోతట్టు పొలాలు జలమయం
రాజుపాళెం, సెప్టెంబరు 29:
మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఖరీ్‌ఫలో సాగైన ప త్తి, మినుము, పంటలకు నెల రోజులుగా వర్షాలు లేక పోవడంతో పంటలన్నీ వాడుముఖం ప ట్టాయి. ఉపరితల ఆవర్తనంతో రెండు రోజులు గా వర్షాలు కురుస్తుండడంతో పంటపొలాలు ప చ్చదనం సంతరించుకున్నాయి. భారీ వర్షం పడడంతో లోతట్టుగా ఉన్న పంట పొలాలు జొన్న, మినుము నీటమునిగాయి. తుఫాను ప్రభావంతో కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో కుందూకు భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దాదాపు 30 వేల క్యూసెక్కులకుపైబడి ఈ నీరు ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది.


పెన్నానదికి కొనసాగుతున్న నీటి విడుదల



మైలవరం, సెప్టెంబరు 29: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం మైలవరం నుంచి పెన్నానదికి 1500 క్యూసెక్కులు నీటిని వదులుతున్నట్లు మైలవరం జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 2000 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోంది. ఉత్తరకాల్వకు 150 క్యూసెక్కులు, దక్షిణ కాల్వకు 120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మైలవరం జలాశయ సామర్ధ్యం 6.500 టీఎంసీలు కాగా ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5.700 టీఎంసీల నిల్వ ఉంది. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఇన్‌ఫ్లో పెరిగితే పెన్నానదికి మరింత నీటిని వదిలే అవకాశం ఉందని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-30T05:14:51+05:30 IST