మండల సమావేశంలో ప్రొటోకాల్‌ రచ్చ

ABN , First Publish Date - 2022-08-19T04:33:54+05:30 IST

‘అధికారులు ప్రొటోకాల్‌ పాటించ డంలేదు. సమావేశాలకు ఆహ్వానించకుండా అవమానిస్తు న్నారు. గ్రామ కార్యదర్శులు సైతం సర్పంచుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.

మండల సమావేశంలో ప్రొటోకాల్‌ రచ్చ
ప్రొటోకాల్‌, రూ.కోటి స్వాహాపై ప్రశ్నిస్తున్న బీజేపీ ఎంపీటీసీ నవీన్‌

ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కారా ? 

ఆహ్వానించకుండా అవమానిస్తారా...  

రూ.కోటి స్వాహాపై చర్యలేవీ : బీజేపీ ఎంపీటీసీ నవీన్‌ 

వాడీవేడిగా ఎర్రగుంట్ల మండల సమావేశం

ఎర్రగుంట్ల, ఆగస్టు 18: ‘అధికారులు ప్రొటోకాల్‌ పాటించ డంలేదు. సమావేశాలకు ఆహ్వానించకుండా అవమానిస్తు న్నారు. గ్రామ కార్యదర్శులు సైతం సర్పంచుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము కూడా ప్రజలతో ఎన్నుకున్నవా రమేకదా ప్రజాప్రతినిధులము కామా’ అంటూ ఎంపీటీసీ లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.   

 ఎర్రగుంట్ల మండల సమావేశంలో చిలమకూరు కార్యదర్శి మురళి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ వైసీపీ, బీజేపీ ఎంపీటీసీలు వై.కొండయ్య, నవీన్‌కుమార్‌ రచ్చ చేశారు. అధ్యక్ష స్థానంలో ఉన్న మల్లు వెంకటమోహన్‌రెడ్డి, రెండో ఉపమండలాధ్యక్షుడు పొన్నా శ్రీను, జడ్పీటీసీ బాలయ్య  మరికొందరు కూడా ఈవిషయంపై గొంతు కలిపారు. ఎంపీటీసీలకు ప్రొటోకాల్‌ ఉందాలేదా ఇప్పుడే తేల్చాలని వారంతా సభలోనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు.

ఈవిషయంపై ఎంపీడీఓ ఎస్‌.సూర్యనారాయణరెడ్డి సమాధానమిస్తూ ఎంపీటీసీలకు కూడా ప్రొటోకాల్‌ వర్తి స్తుందన్నారు. ఏ అధికారిక సమావేశం నిర్వహించినా వారి ని కార్యదర్శి తప్పకుండా ఆహ్వానించాల్సిందేనన్నారు.  చిల మకూరు కార్యదర్శి మమ్మల్ని ఎందుకు పిలవడంలేదో ఇక్కడే సమాధానం చెప్పాలన్నారు. చిన్నదండ్లూరు సర్పం చి సి.రాముడు మాట్లాడుతూ గతంలో విద్యుత్‌ కనెక్షన్లు వారికి మీటర్లు ఇవ్వడంలేదని, విద్యుత్‌ పోల్స్‌ మార్చమంటే పలకడం లేదని ప్రశ్నించారు. వలసపల్లె సర్పంచి బీమచెర్ల గంగమ్మ మాట్లాడుతూ వలసపల్లెలో స్కూల్‌ వద్ద విద్యుత్‌ లైన్లు వేలాడుతున్నాయని వాటిని వెంటనే మార్చాలన్నారు. చిలంకూరు ఎంపీటీసీ వై.కొండయ్య మాట్లాడుతూ చిలం కూరులో పోల్స్‌ మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా పలకడం లేదని ఇక మేమేందుకు సభకు రావాలని ప్రశ్నించారు.

పం చాయతీల్లో నిధుల్లేవు, చేసిన పనులకే బిల్లులు రాక ఇబ్బం దులు పడుతున్నాము, నిధులు వచ్చే వరకు చీకట్లో ఉండా ల్సిందేనా అంటూ ప్రశ్నించారు. ప్రతి రైతు ఈ క్రాప్‌ చేసు కుంటేనే పంటలబీమా, పరిహారం,  క్రాప్‌లోన్‌కు సున్నా వడ్డీ, గిట్టుబాటు ధర వస్తుందని ఏఓ శ్రీకాంత్‌రెడ్డి తెలిపా రు. పోట్లదుర్తి పశువైద్యాధికారి జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ధరకు దాణా సరఫరా చేస్తోందన్నారు. చిలంకూరులో సుమారు 50వేల లీటర్ల నీరు వృధా అవుతున్నా పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ కొండయ్య,  పైప్‌లైన్‌లు మార్చాలని కోరినా పట్టించుకోవడంలేదని చిన్న దండ్లూరు సర్పంచు రాముడు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ రాజారా మ్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.

చిలంకూరులో రూ.కోటి నిధు లు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ వాటిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలెందుకు తీసుకోలేదని చిలంకూరు బీజేపీ ఎంపీటీసీ నవీన్‌ సభలో ప్రశ్నించారు. ఎంపీడీఓ సమాధానం చెబుతూ డీఎల్‌పీఓ చర్యలు తీసు కోవాల్సి వుందన్నారు. జడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ ఈ సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు, సమస్యలకు సమాధానాలు వచ్చే సభలో ఏమేరకు చేసింది తెలపాలని కోరారు. సమావేశాలకు రాని అధికారులకు ఇస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. విద్యుత్‌ ఏఈ సుబ్బారావు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T04:33:54+05:30 IST