భక్తిశ్రద్ధలతో పుష్పకావళ్ల ఊరేగింపు

ABN , First Publish Date - 2021-08-04T05:28:07+05:30 IST

సోమల బంగారు తిరుత్తణి కొండపై ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా మంగళవారం పుష్ప కావళ్లతో భక్తులు హరోం హర నామస్మరణలతో సోమల వీధుల్లో ఊరేగారు.

భక్తిశ్రద్ధలతో పుష్పకావళ్ల ఊరేగింపు
సోమల వీధుల్లో పుష్పకావళ్ల ఊరేగింపు

సోమల, ఆగస్టు 3: సోమల బంగారు తిరుత్తణి కొండపై ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా మంగళవారం పుష్ప కావళ్లతో భక్తులు హరోం హర నామస్మరణలతో సోమల వీధుల్లో ఊరేగారు.  ఈ సందర్భంగా ఇంటింటా మహిళలు పుష్పకావళ్లకు పూజలు చేశారు. ఆలయంలో పురోహితులు స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.  కావళ్లతో వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి మొక్కులు తీర్చుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ. 1.50 లక్షల వ్యయంతో ఉత్సవమూర్తులను అందజేసిన పూల మురళీ కృష్ణ దంపతులను ఆలయ ధర్మకర్తలు మేల్నాటి రఘుపతి, పద్మావతమ్మ సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాల్లో పాగొండ వేణుగోపాల్‌, రెడ్డి, కపిల సుబ్రహ్మణ్యం, శంకర్‌రెడ్డి, గన్నా చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T05:28:07+05:30 IST