Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 01 Jan 2022 19:07:07 IST

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..

twitter-iconwatsapp-iconfb-icon
ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..

అరుదైన జననం అని చాలా వార్తలు వింటూ ఉంటాం. కానీ ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఇలాంటి జననాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్లాస్టిక్‌తో చుట్టబడి ఉన్న ఆ శిశువును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్లాస్టిక్ చుట్టబడి జన్మించిన ఆ శిశువును చూసి.. నర్సులు, వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ దూబే మాట్లాడుతూ ఇలాంటి జననాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయని చెప్పారు. ప్రపంచంలో 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు ఇలా జన్మిస్తుంటారని, ఇలాంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీలని పిలుస్తారని వివరించారు. తండ్రి స్పెర్మ్‌లో మార్పుల కారణంగా ఇలా జరుగుతందని తెలిపారు.

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..

ప్రసుత్తం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. భవిష్యత్‌లో ఇలాగే ఉంటుందని స్పష్టంగా చెప్పలేమన్నారు. పంజాబ్‌, తదితర ప్రాంతాల్లో గత ఏడేళ్లలో ఇలాంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి ఇంకా చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిశువు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఔరంగబాద్‌లో ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

సీరియస్‌గా సీరియల్ చూస్తున్న కుటుంబం.. ఇంతలో పైఅంతస్తు నుంచి శబ్ధాలు.. కంగారుగా పరుగెత్తుకుంటూ పైకెళ్లి చూస్తే.. పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..videoఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు.. 35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే.. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.