అభివృద్ధి పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-05-08T05:12:31+05:30 IST

జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాల అమలుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలి
గట్టుదుద్దెనపల్లిలో ఉపాధిహామీ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ శశాంక

 కలెక్టర్‌ కె శశాంక 

కరీంనగర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాల అమలుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యా ల యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గం వారీగా మండలాల్లో దర ఖాస్తు చేసుకున్న వాటి ప్రకారం రివైజ్డ్‌ డిస్ర్టిక్ట్‌ ట్రైకార్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020-21 తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  లబ్ధిదారులం దరికీ సమాన అవకాశం కల్పించాలని సూచించారు. 

జిల్లాలోని 15 మండలాల, 5 మున్సిపాలిటీలకు ఎస్టీ జనాభా ప్రాతి పదికగా కేటాయించాలని తెలిపారు. ఎంపిక చేసిన దరఖాస్తులను డీటీడీ వో కరీంనగర్‌ కార్యాలయానికి పంపించాలన్నారు. బెనిఫిషరీస్‌ ఓబీ ఎంఎం ఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న యూనిట్లను, జిల్లాకు అలాట్‌మెంట్‌ చేసిన సబ్సిడీని దృష్టిలో ఉంచుకొని మండలాల వారీగా, మున్సిపాలిటీల వారీగా కేటాయించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాం, ఎల్‌డీఎం లక్ష్మణ్‌, బీసీ వెల్ఫేర్‌ రాజా మనోహర్‌రావు, ఎస్సీ వెల్ఫేర్‌ మధుసూదన్‌శర్మ, మైనార్టీ వెల్ఫేర్‌ మధు సూదన్‌, అధికారులు పాల్గొన్నారు. 

సమన్వయంతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలి

జిల్లాలో వైద్యాధికారులు, నోడల్‌ అధికారులు సమన్వయంతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్‌ నియంత్రణ చర్యలపై వైద్యాధి కారులు, జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 604 ఇంటింటి ఆరోగ్య పరీక్ష సర్వే టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వే టీంలు కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చేలా ఏర్పా ట్లు చేయాలని సూచించారు. 

జిల్లాలో హోం ఐసోలేషన్‌ కిట్‌లకు కొరత లేకుండా ముందస్తు ఏర్పా ట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఆరోగ్య కేం ద్రాల వారీగా మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇంటింటి ఆరోగ్య పరీక్షల టీంలను మండల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతిరోజు ఎన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, ఎన్ని ఐసో లేషన్‌ కిట్లు పంపిణీ చేశారనే వివరాలను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్‌ సెంటర్లలో కొవిడ్‌ ఓపీ సేవలను ప్రారంభించాలని ఆదేశించారు. టెలీ మెడిసిన్‌ సెంటర్‌ సేవల సమయాన్ని పెంచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని డాక్టర్‌ రవీందర్‌రెడ్డికి సూచించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బెడ్స్‌ పెంచుకోవడానికి కోరితే అనుమతించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు అవసర మైన రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు, మందుల కొనుగోలుకు ఆర్డర్‌ వారే చేసుకు నేలా పర్యవేక్షిం చాలని అన్నారు. కొవిడ్‌ రోగులకు ప్రొటోకాల్‌ ప్రకారం వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఆక్సిజన్‌ డిమాండ్‌ బాగా ఉన్నందున లీకేజీ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొవిడ్‌ కేర్‌ సెం టర్‌లో 23 మంది కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లో ఆటోమేటిక్‌ మిషన్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ సూచిం చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలు మెరుగు పర్చాలని అన్నారు. ముందుగా రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారి కే వ్యాక్సిన్‌ ఇవ్వాలని అన్నారు. జిల్లాలో మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోస్‌కు తగినంత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని, ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, కరోనా నిర్ధారణ పరీక్షలు సజావుగా సాగేలా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాజిదా, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువేరియా, నోడల్‌ అధికారులు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ సీఈవో రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పద్మావతి పాల్గొన్నారు. 


జమ్మికుంట ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్‌


జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని కొవిడ్‌ ఆసుపత్రి (ప్రభుత్వ ఆసుపత్రి)లో చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ శశాంక ఆన్నారు. శుక్రవారం పట్టణంలోని కొవిడ్‌ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశా రు. కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, మౌలిక సదుపాయాలు, ఇతర విషయాలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుమన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డు పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ బారిన పడి ఆక్సీ జన్‌ లెవల్స్‌ పడిపోయిన వారు హన్మకొండ, వరంగల్‌ ఆసుపత్రులకు వెళ్లా లంటే ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేదని, ఆలాంటి ఇబ్బందులు లేకుం డా పట్టణంలో కోవిడ్‌ చికిత్స అందుబాటులోకి తీసుకు రావడం జరిగిం దన్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 28మంది చికిత్స పొందారని, వారిలో 17మంది రికవరీ అయి ఇంటికి వెళ్లారని, 11మందికి ఆక్సిజన్‌ పెట్టిన రికవరీ కాకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆక్సిజన్‌, మందులు, పల్మాలాజిస్ట్‌లు, ఫిజిషియన్‌, అనస్తేషియా వైద్యులు, నర్సులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సేవలను ఈ ప్రాంత ప్రజలు సద్వినీయోగం చేసుకోవా లని కోరారు. ఆయన వెంట ఆర్డీవో బెన్‌షాలేం, తహాశీల్దార్‌ కన్నం నారాయణ, వైద్యాధికారులు ఉన్నారు. 


ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి


మానకొండూర్‌ : ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ శశాంక సూచించారు. మండలంలోని గట్టుదుద్దెనపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధీహామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచి కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాలని అఽధికారులను ఆదేశించారు. రూ. 180 నుంచి రూ 200 కూలి పడేటట్లు కూలీలు కష్టపడాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఽఅధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డివో పీడీ శ్రీలత, సర్పంచ్‌ దేవ సతీష్‌రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఏపీఎంలు నిరంజన్‌, సంతోష్‌రావు, కూలీలు ఉన్నారు. 

Updated Date - 2021-05-08T05:12:31+05:30 IST