ఆదివాసీల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-10T09:50:53+05:30 IST

ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.

ఆదివాసీల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర.. పాడేరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలు 

పాడేరు/ సీతంపేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పాడేరు అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ  పాల్గొన్నారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ కేంద్రంగా మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ముందుగా సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న  అడవితల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో బి.నవ్య, ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు..

 

ఆదివాసీ సంపదను  దోచుకునేందుకే హైవే: సాకే

అనంతగిరి: ఏజెన్సీలో ఆదివాసీల సంపదను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం మన్యంలో హైవేల పేరిట రహదారుల విస్తరణ చేపడుతోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆరోపించారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో   విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల హక్కులను కాపాడింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు.

Updated Date - 2022-08-10T09:50:53+05:30 IST