Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 24 May 2022 19:19:14 IST

18 ఏళ్ల Aish... 15 వందల Cash...

twitter-iconwatsapp-iconfb-icon

ఐశ్వర్య రాయ్... తాజాగా జరిగిన కేన్స్ సంబరాల్లోనూ ఛమక్కున మెరిసిన భారతీయ సౌందర్యం! 21 సంవత్సరాలుగా ఆమె అంతర్జాతీయ వేదికపై తళుక్కుమంటూనే ఉంది. ఐష్ సొగసు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేదేముంది? కానీ, సొషల్ మీడియాలో ఆమె ప్రస్థానం గురించి మరోసారి చర్చ సాగుతోంది. అందుక్కారణం, 30 ఏళ్ల కిందటి 15 వందల రూపాయల బిల్లు! 

18 ఏళ్ల Aish... 15 వందల Cash...

1994లో మిస్ వరల్డ్ అయిన మన ప్రపంచ సుందరి అంతకంటే ముందే మోడలింగ్ చేసేది. అలా ఐశ్వర్య రాయ్ పాల్గొన్న ఒక మ్యాగజైన్ తాలూకూ ఫోటోషూట్, 1992లో జరిగింది. అంటే, అప్పటికి 18 ఏళ్ల టీనేజ్ ఐశ్వర్య ఇంకా బ్యూటీ క్వీన్ కాదన్నమాట. సాదాసీదా అప్ కమింగ్ మోడల్ గా ‘కృపా క్రియేషన్స్’ అనే సంస్థ కోసం ఆమె కెమెరా ముందుకొచ్చింది. సల్వార్ కమీజ్ ధరించి ఫోజులిచ్చింది. అయితే, సదరు ఫ్యాషన్ క్యాటలాగ్ కోసం ఐశ్వర్య రాయ్ అందుకున్న ఫీజు ఎంతో తెలుసా?  అక్షరాలా 15 వందల రూపాయలు...

18 ఏళ్ల Aish... 15 వందల Cash...

ఓ బాలీవుడ్ అప్ డేట్స్ అందించే సొషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన ఫోటో ప్రకారం... ఐశ్వర్య రాయ్ కృపా క్రియేషన్స్ అనే సంస్థకు మోడల్ గా వ్యవహరించటానికి ఒప్పుకున్నట్టు మనం అగ్రిమెంట్ చూడవచ్చు. అందుకుగానూ 15 వందల రూపాయలు ఆమెకు చెక్కు ద్వారా చెల్లించారు. ఆ విషయం కూడా స్పష్టం చేస్తూ బిల్ పైన సంతకం చేసింది ఐష్! 30 ఏళ్ల కింద 15 వందల ఆదాయంతో మొదలు పెట్టిన తన ప్రయాణం విజయవంతంగా ఇంకా కొనసాగిస్తోంది గార్జియస్ గాడెస్. త్వరలో బహూ బచ్చన్ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో మరోసారి మణిరత్నం దర్శకత్వంలో మన ముందుకు రానుంది... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International