అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-09T04:23:08+05:30 IST

ఈడిగప ల్లె సమీపంలోని నక్కలగుట్ట వద్ద గొడ్డిండ్ల వడ్డెపల్లె వాసి మదన్‌ (45) అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పోలీస్‌ అధికారులు - మదన్‌ ఫైల్‌ ఫొటో

వీరబల్లి, ఆగస్టు8: ఈడిగప ల్లె సమీపంలోని నక్కలగుట్ట వద్ద గొడ్డిండ్ల వడ్డెపల్లె వాసి మదన్‌ (45) అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఈడిగపల్లె లో పీర్ల పండుగ సందర్భం గా గుండం నిర్వహించారు. మదన్‌కు సమీప గ్రామ మైన నాయునివారిపల్లెలో చాందినీ బండి కట్టారు. ఆ బండితో మదన్‌ వచ్చినట్లు బంధువులు తెలిపారు. వీరబల్లి- గడికోట రోడ్డులో నక్కల గుట్ట వద్ద రోడ్డుపై పడి తల కు బలమైన గాయపడినట్లు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అత ను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని ఎవరో కొట్టి చంపారని బంధువు లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కుటుం బ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ లింగప్ప దర్యాప్తు చేస్తున్నారు. 

మదన్‌ది ముమ్మాటికీ హత్యే...

పీర్ల పండుగ చూసొస్తానని చెప్పి వెళ్లి మృ తదేహం కన్పించడం చూస్తే మదన్‌ది ము మ్మాటికీ హత్యేనని భార్య నాగమునెమ్మ, కు మార్తెలు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు పక్కా ఆధా రాలు ఇచ్చి వారిపై కేసు నమోదు చేయాలని చెబుతున్నా అను మా నాస్పదం అంటూ కేసు నమోదు చేయడమెం దుకని వారితో వాదోపవాదాలకు దిగారు.  ఇచ్చిన ఆధారాలతో నిందితులపై కేసు నమో దు చేసి వారిని అరెస్టు చేసేంతవరకు తా ము మృతదేహాన్ని తీసుకెళ్లమని ఖరాకండిగా తేల్చి చెప్పారు. సీఐ లింగప్ప, ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ వారికి న్యాయం చేస్తామని, అంత్యక్రియలు చేయించాలని  సూచించారు. వారు వినకపోవడంతో వారిని వదిలి స్టేషన్‌ లోకి వెళ్లిపోయారు. 

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

దువ్వూరు, ఆగస్టు 8: అనుమానాస్పద స్థితిలో ఆరవేటి మాధవి (23) ఆదివారం మృతిచెందినట్లు దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి బ్రహ్మయ్య ఆచారి ఫిర్యాదు మేరకు వివరాలిల్లోకెళితే... రెండేళ్ల కిందట దువ్వూరు వాసి ఆరవేటి ము రళీకృష్ణకు మాధవితో వివాహమైంది. అత్తమామలు, ఆడపడచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 28న ఆరోగ్యం సరిగా లేదంటూ ఆస్పత్రిలో చేర్పించారని, తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు బ్రహ్మయ్య ఆచారి ఫిర్యాదు చేశారు. సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తహసీల్దారు రమాకుమారి విచారించారు. 


Updated Date - 2022-08-09T04:23:08+05:30 IST