రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-04T05:08:09+05:30 IST

చుక్కలూరు గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుదాటు తున్న ఆ గ్రామ వాసి రాఘవ (45)ను గుర్తుతెలి యని కారు ఢీకొనడంతో మరణించాడు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
రాఘవ మృతదేహం

తాడిపత్రిటౌన, జూలై 3 : చుక్కలూరు గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుదాటు తున్న ఆ గ్రామ వాసి రాఘవ (45)ను గుర్తుతెలి యని కారు ఢీకొనడంతో మరణించాడు. రాఘవ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం తెల్లవా రుజామున రాఘవ బహిర్భూమి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్‌ పోలీసులు తెలిపారు. రాఘవకు  భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 


Updated Date - 2022-07-04T05:08:09+05:30 IST