ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2020-09-26T10:12:45+05:30 IST

వికారాబాద్‌ నియోజకవర్గంలో ఇది వరకు నిర్మించిన ఇళ్లకు శాశ్వత పరిష్కారం చూపి స్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్

ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

వికారాబాద్‌: వికారాబాద్‌ నియోజకవర్గంలో ఇది వరకు నిర్మించిన ఇళ్లకు శాశ్వత పరిష్కారం చూపి స్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, మునిసిపాలిటీలో ఇప్పటి వరకు ఉన్న ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌ చేయడం, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఉన్న సమస్యలు, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌, ఎంపీపీలు వసంత, విజయలక్ష్మి, లలిత, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రకళ, జడ్పీటీసీలు సుజాత, మధుకర్‌, పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T10:12:45+05:30 IST