శిక్ష పడిన నేతలపై శాశ్వత నిషేధం విధించాలి

ABN , First Publish Date - 2022-08-11T08:54:28+05:30 IST

క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితాంతం నిషేధం విధించాలని కోరుతూ బుఽధవారం సుప్రీంకోర్టులో ప్రజా

శిక్ష పడిన నేతలపై శాశ్వత నిషేధం విధించాలి

సుప్రీంకోర్టులో ‘పిల్‌’.. విచారణకు స్వీకరణ


న్యూఢిల్లీ, ఆగస్టు 10: క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితాంతం నిషేధం విధించాలని కోరుతూ బుఽధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం పరిశీలనకు స్వీకరించింది. ఇందుకు సంబంధించి ప్రజాప్రతినిధుల చట్టంలో లోపాలు ఉన్నాయన్న విషయాన్ని ధర్మాసనం గుర్తించింది. బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ ఈ ‘పిల్‌’ను దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ ఉదాహరణకు ఒక కానిస్టేబుల్‌కు శిక్ష పడితే శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోతాడని తెలిపారు. అదే ప్రజాప్రతినిధి అయితే శిక్ష అనుభవించిన ఆరేళ్ల తరువాత మళ్లీ పోటీ చేయవచ్చని చెప్పారు. చట్టంలో ఉన్న లోపాన్ని సవరించాల్సి ఉందని తెలిపారు. దీనిపై తరువాత విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్‌ రమణ చెప్పారు. 

Updated Date - 2022-08-11T08:54:28+05:30 IST