సరైన సలాడ్‌

ABN , First Publish Date - 2022-08-20T05:42:31+05:30 IST

పర్ఫెక్ట్‌గా వండాలే కానీ.. నాన్‌వెజ్‌ కంటే వెరైటీగా, ‘టేస్టీ’గా వెజ్‌ ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే ఆహారమే కాకుండా ఈ కూల్‌ డేస్‌లో కూసింత విభిన్నంగా కుక్‌ చేసుకోండి. బీట్‌రూట్‌ సలాడ్‌, మష్రూమ్‌ సలాడ్‌, పన్నీర్‌ టిక్కాలను ఇంట్లోనే చేసుకొని ఓ చూపు చూడండి.

సరైన సలాడ్‌

పర్ఫెక్ట్‌గా వండాలే కానీ.. నాన్‌వెజ్‌ కంటే వెరైటీగా, ‘టేస్టీ’గా వెజ్‌ ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే ఆహారమే కాకుండా ఈ కూల్‌ డేస్‌లో కూసింత విభిన్నంగా కుక్‌ చేసుకోండి. బీట్‌రూట్‌ సలాడ్‌, మష్రూమ్‌ సలాడ్‌, పన్నీర్‌ టిక్కాలను ఇంట్లోనే చేసుకొని ఓ చూపు చూడండి. 


పనీర్‌ టిక్కా

కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయ- ఒకటి (చతురస్రాకారంగా 1 ఇంచ్‌నుంచి 1.5 ఇంచ్‌ల ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), ఆకుపచ్చని క్యాప్సికమ్‌-1 (1 ఇంచ్‌ నుంచి 1.5 ఇంచ్‌ల వరకూ చతురస్రాకారం లేదా రౌండ్‌గా కట్‌ చేసుకోవాలి), టొమాటో ముక్కలు- అరకప్పు, వెల్లుల్లి- 7, అల్లం- 1.5 ఇంచ్‌ల ముక్క(వీటిని క్రష్‌ చేయాలి), చతురస్రాకార పనీరు ముక్కలు- 250 గ్రాములు, జింజర్‌,గార్లిక్‌ పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌ 


టిక్కా మారినేట్‌ కోసం

పెరుగు- 200 గ్రాములు తీసుకుని స్మూత్‌గా అయ్యేట్లు చిన్న కవ్వంతో చిలకాలి. ఇప్పుడు టేబుల్‌ స్పూన్‌ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌తో పాటు క్రష్డ్‌ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌ను పెరుగులో కలపాలి. ఆ తర్వాత వీటిలో రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారంపొడి, టేబుల్‌ స్పూన్‌ కొత్తిమీర పేస్ట్‌, అర టీస్పూన్‌ పసుపు, అరటీ స్పూన్‌ గరం మసాలా, టీ స్పూన్‌ జీలకర్ర పౌడర్‌, టేబుల్‌ స్పూన్‌ ఆమ్‌చూర్‌, టేబుల్‌ స్పూన్‌ అజ్‌వైన్‌, టేబుల్‌ స్పూన్‌ చాట్‌ మసాలా, అర టీ స్పూన్‌ బ్లాక్‌ పెప్పర్‌ పౌడర్‌ వేయాలి. కశ్మీరీ కారంపొడిలో కారం తక్కువ ఉంటుంది. అందుకే వీటితో పాటు టేబుల్‌ స్పూన్‌ మిరియాలు, అరటీ స్పూన్‌ బ్లాక్‌ సాల్ట్‌ టేస్ట్‌ కోసం వేయాలి. బ్లాక్‌ సాల్ట్‌ లేకుంటే వదిలేయండి. దీనికి అర టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేయాలి. టేబుల్‌ స్పూన్‌ ఆవాల నూనె వేయాలి. ఇది లేకపోతే మామూలు నూనె వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత వీటిలోకి ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, పనీర్‌ ముక్కలు వేసి మారినేట్‌ చేయాలి. పనీరులో అన్ని అంచులకు మిశ్రమం పట్టేట్లు చేయాలి. ఆ తర్వాత పనీర్‌, కట్‌ చేసుకున్న వెజీస్‌ను రెండుగంటల కంటే ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచాలి. 


గ్రిల్‌ చేసే విధానం

వెదురు స్కీవెర్స్‌కి ఒకటిన్నర ఇంచుల ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌, టొమాటో వెజీ్‌సను మార్చి మార్చి మధ్యలో పన్నీర్‌ను ఉంచుతూ గుచ్చాలి. అంతకుముందే ఓవెన్‌ను 230 నుంచి 240 డిగ్రీల సెల్షియస్‌ వరకూ లేదా 464 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ ఉండేట్లు చూసుకోవాలి. అల్యూమినియం పూత ఉండే ట్రేలో పన్నీర్‌ స్కీవెర్స్‌ని ఉంచి ఓవెన్‌లో ఉంచాలి. 


కొద్దిసేపయ్యాక నూనెతో పన్నీర్‌, వెజీలను బ్రష్‌ చేయాలి. ఆ తర్వాత బంగారం రంగువచ్చేంత వరకూ ఓవెన్‌లో ఉంచాలి. అలాగని మరీ గట్టిగా అయ్యేట్లు కాల్చకూడదు. ఒకవేళ ఇవన్నీ చేయలేం.. ఓవెన్‌లు లేవు అనుకుంటే బొగ్గుల మీద నెట్‌లా ఉండే ఇనుప జాలరిని ఉంచి దానిపైన ఎంచక్కా పనీర్‌ టిక్కాను చేసుకోవచ్చు. పనీర్‌ టిక్కా గ్రిల్‌ అయ్యాక ప్లేట్‌లో వేసుకుని దానిపై చాట్‌ మసాలా, నిమ్మరసం చల్లుకోవాలి. దీన్ని పుదీనా చట్నీతో తినాలి. 


మష్రూమ్‌ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు

బటన్‌ మష్రూమ్స్‌- 500 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు-150 గ్రాములు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు-250 గ్రాములు, ఆలివ్‌ నూనె- 80గ్రాములు, వెల్లుల్లి-20 గ్రాములు, థైమ్‌- 5 గ్రాములు(పుదీనాలా ఉండే హెర్బ్‌), కొత్తిమీర విత్తనాలు- 5 గ్రాములు, వైట్‌ వైన్‌- 60 గ్రాములు, వైట్‌ వెనిగర్‌-40 గ్రాములు, నిమ్మరసం- 20 గ్రాములు, ఉప్పు- రుచికి తగినంత, పెప్పర్‌- 10 గ్రాములు


తయారీ విధానం

మష్రూమ్స్‌ని శుభ్రంగా కడగాలి. ఒక్కో మష్రూమ్‌ను రెండుగా కట్‌ చేయాలి. ఉప్పు నీటిలో వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో ఆలివ్‌ నూనె వేయాలి. అందులో వెల్లుల్లి, థైమ్‌ ఆకులు, కొత్తిమీర విత్తనాలు వేసి రోస్ట్‌ చేయాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా క్రష్‌ చేయాలి. అందులోకి వైట్‌ వైన్‌, వైట్‌ వెనిగర్‌, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు, పెప్పర్‌ వేయాలి. అన్ని పదార్థాలను మిశ్రమం అయ్యేంత  వరకూ కలపాలి. బాగా మిక్స్‌ అయ్యాక.. ఉడికించిన మష్రూమ్స్‌ అందులో వేయాలి. మిశ్రమాన్ని అంతా మిక్స్‌ చేస్తే మష్రూమ్స్‌ సలాడ్‌ రెడీ.



బీట్‌ రూట్‌ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు 

బీట్‌రూట్‌- 1200 గ్రాములు, వైట్‌ వెనిగర్‌- 750 ఎమ్‌.ఎల్‌, జునిపెర్‌ బెర్రిస్‌-5 గ్రాములు, లవంగాలు- 5 గ్రాములు, పెప్పర్‌ కార్న్స్‌- 20 గ్రాములు, వెనిగ్రెట్టె- 20 ఎమ్‌.ఎల్‌, తరిగిన కొత్తిమీర- 20 గ్రాములు, ఉప్పు- తగినంత, పెప్పర్‌- 10 గ్రాములు, తొక్కతో ఉండే నారింజ పండ్ల ముక్కలు- 180 గ్రాములు, పుదీన- 10 గ్రాములు

తయారీ విధానం

ముందుగా బీట్‌రూట్స్‌ తొక్కలను పీలర్‌తో తీసేయాలి. ముక్కలుగా తరిగి ఉడికించి చల్లారబెట్టాలి. ఈ లోపు ప్యాన్‌లో వైట్‌ వెనిగర్‌, జునిపెర్‌ బెర్రీస్‌, లవంగాలు, పెప్పర్‌ కార్న్స్‌, వెనిగ్రెట్టె, ఉప్పు, పెప్పర్‌ వేసి మిక్స్‌ చేయాలి. రెండు నిమిషాల పాటు కుక్‌ చేయాలి. చల్లబడిన బీట్‌రూట్‌ మిశ్రమాన్ని వేయాలి. కొత్తిమీర, పుదీన, నారింజ ముక్కలు వేసి గార్నిస్‌ చేసుకోవాలి. చూడటానికి డెలిషియస్‌గా ఉండే బీట్‌రూట్‌ సలాడ్‌ తింటే శరీరానికెంతో ఉపయోగం.


Updated Date - 2022-08-20T05:42:31+05:30 IST