తగ్గేదేలే

ABN , First Publish Date - 2021-12-03T07:35:52+05:30 IST

: ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ భారత్‌లోకీ ప్రవేశించింది. కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తగ్గేదేలే

సెన్సెక్స్‌ 777 పాయింట్లు అప్‌ 

రెండో రోజూ మార్కెట్‌ జోరు

 17,400 ఎగువ  స్థాయికి నిఫ్టీ 


ముంబై: ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ భారత్‌లోకీ ప్రవేశించింది. కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కు తోడు అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల ప్రతికూల సంకేతాలనూ గురువారం నాడు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు ఏమాత్రం పట్టించుకోలేదు. వరుసగా రెండో రోజూ కొనుగోళ్ల జోరును కొనసాగించడంతో దేశీయ ఈక్విటీ సూచీలు రివ్వున ఎగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 58,000, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 17,400 స్థాయిని తిరిగి నిలబెట్టుకోగలిగాయి. 


రెండో త్రైమాసిక జీడీపీ, నవంబరులో జీఎ్‌సటీ వసూళ్లు, ఎగుమతులు, పారిశ్రామికోత్పత్తి ఆశాజనకంగా ఉండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడం వంటి అంశాలు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లకు దన్నుగా నిలిచాయి. దీంతో గురువారం సెన్సెక్స్‌ 776.50 పాయింట్లు లాభపడి 58,461.29 పాయింట్ల వద్ద క్లోజైంది. నిఫ్టీ 234.75 పాయింట్ల లాభంతో 17,401.65 పాయింట్ల వద్ద ముగిసింది. గడిచిన రెండు సెషన్లలో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద రూ.5.35 లక్షల కోట్ల మేర పెరిగింది. దాంతో బీఎ స్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తంమార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.262.53 లక్షల కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2021-12-03T07:35:52+05:30 IST