దేశంలో కొత్త చరిత్ర మొదలైంది: రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-02-13T23:56:01+05:30 IST

దేశంలో కొత్త చరిత్ర మొదలైందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ అన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి వచ్చారు

దేశంలో కొత్త చరిత్ర మొదలైంది: రాష్ట్రపతి

హైదరాబాద్: దేశంలో కొత్త చరిత్ర మొదలైందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ అన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి వచ్చారు. శ్రీరామానుజాచార్యుల 120 కిలోల (120 ఏళ్లకు గుర్తుగా) స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజ భారీ విగ్రహాన్ని సందర్శించి, ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ‘‘స్వర్ణ రామానుజ విగ్రహాన్ని లోకాయుక్తం చేయడం నా అదృష్టం. భక్తి, సమానత కోసం రామానుజులవారు విశేష కృషి చేశారు. భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులవారు నిరూపించారు. ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రామానుజాచార్యుల బోధనలకు అంబేద్కర్ ప్రభావితం అయ్యారు. వసుదైక కుటుంబం అనే భావన రామానుజుల నుంచే వచ్చింది. అంటరానితనం నిషేధం, సమానత్వం అంశాలకు.. రామానుజా చార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయి’’ అని రామ్‌నాథ్‌ తెలిపారు.


అంతకుముందు రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. రామానుజుల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ లోకార్పణం చేశారు. స్వర్ణ రామానుజుల విగ్రహానికి  రామ్‌నాథ్‌ తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా రామానుజ విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్రపతికి చినజీయర్ స్వామి వివరించారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్‌ ఆశ్రమానికి వెళ్లారు.

Updated Date - 2022-02-13T23:56:01+05:30 IST