ఐఫోన్‌ ప్రీమియమ్‌ యూజర్లకు యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌

ABN , First Publish Date - 2021-08-28T06:01:53+05:30 IST

ఐఫోన్‌కు తోడు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్‌ ఉన్న యూజర్లకు ఐఔస్‌ యూట్యూబ్‌ యాప్‌తో ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌’ వీడియోవాచ్‌కు అవకాశం కలుగుతుంది. 9 టు 5 గూగుల్‌ నివేదిక ప్రకారం, ఈ ఫీచర్‌ ఇప్పటికే విడుదలైంది. అయితే చందాదారులు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది...

ఐఫోన్‌ ప్రీమియమ్‌ యూజర్లకు యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌

ఐఫోన్‌కు తోడు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్‌ ఉన్న యూజర్లకు ఐఔస్‌ యూట్యూబ్‌ యాప్‌తో ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌’ వీడియోవాచ్‌కు అవకాశం కలుగుతుంది. 9 టు 5 గూగుల్‌ నివేదిక ప్రకారం, ఈ ఫీచర్‌ ఇప్పటికే విడుదలైంది. అయితే చందాదారులు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఆ కారణంగా యాప్‌లోకి వెళ్లి దీనిని మాన్యువల్‌గా యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. ఆప్పుడే పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ను వినియోగించుకోవచ్చు. స్ర్కీన్‌పై ఓపెన్‌ చేసిన ఇతర యాప్‌ల నుంచి వీడియో కంటెంట్‌ను వీక్షించే వీలు కలుగుతుంది. దీని కోసం గూగుల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలి. యూట్యూబ్‌.కామ్‌/న్యూ లోకి వెళ్ళాలి. ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఐఔస్‌’ కోసం సెర్చ్‌ చేయాలి. ‘ట్రై ఇట్‌ ఔట్‌’ని టాప్‌ చేస్తే, మీ ప్రీమియం అకౌంట్‌  యాక్టివేట్‌ అవుతుంది. య్యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి కోరుకున్న వీడియోను చూడవచ్చు. స్వైప్‌ అప్‌ లేదంటే బటన్‌ ప్రెస్‌ చేయడం ద్వారా యాప్‌ మూసుకుంటుంది. ఇన్‌సైడ్‌లో ఉండే మినీ స్ర్కీన్‌ మీద పిఐపి మోడ్‌లో వీడియో ప్లే అవుతుంది. స్ర్కీన్‌ని లాక్‌ చేస్తే విరామం లభిస్తుంది. అయితే లాక్‌స్ర్కీన్‌ కంట్రోల్స్‌తో కోరుకున్న విధంగా కంటెంట్‌ను ఇష్టమొచ్చిన విధంగా ప్లే చేసుకోవచ్చు. 

Updated Date - 2021-08-28T06:01:53+05:30 IST