నారింజరంగు శరీరం.. నల్లని రెక్కలు

ABN , First Publish Date - 2021-01-14T18:27:54+05:30 IST

నారింజ రంగు శరీరంలో, నల్లని రెక్కలతో ఉన్న అరుదైన గబ్బిలం శాస్త్రవేత్తల కంటపడింది. 2018లో పశ్చిమ ఆఫ్రికాలో శాస్త్రవేత్తలు చేపట్టిన అన్వేషణ తాజాగా ఫలించింది.

నారింజరంగు శరీరం.. నల్లని రెక్కలు

గినియా: నారింజ రంగు శరీరంలో, నల్లని రెక్కలతో ఉన్న అరుదైన గబ్బిలం శాస్త్రవేత్తల కంటపడింది. పశ్చిమ ఆఫ్రికాలో శాస్త్రవేత్తలు చేపట్టిన అన్వేషణ తాజాగా ఫలించింది. సుమారు 1400 రకాల గబ్బిలాల జాబితాలో ఉండగా, ఏటా 20 రకాలు ఈ జాబితాలో చేరుతున్నాయి. అయితే వీటిల్లో ఎక్కువగా ల్యాబ్‌లలో ప్రాణం పోసుకుంటుండగా, తాజాగా కనిపించిన గబ్బిలం సహజసిద్ధంగా, చాలా కొత్తగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో దీన్ని కనుగొన్నారు. స్థానిక నింబ పర్వతశ్రేణుల్లో కనిపించింది. అరుదైన గబ్బిలంగా అధికారికంగా ధ్రువీకరించారు. అయితే నింబా పర్వతాలలోని వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. దీన్ని బట్టి పూర్తిస్థాయి అవగాహన కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

Updated Date - 2021-01-14T18:27:54+05:30 IST