ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2022-08-12T06:27:01+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా ఈనెల 13, 14, 15 తేదీల్లో ఏజెన్సీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న గోపాలక్రిష్ణ

అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం  

పాడేరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా ఈనెల 13, 14, 15 తేదీల్లో ఏజెన్సీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఏజెన్సీలోని మండల స్థాయి అధికారులతో గురువారం నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు గానూ ఏజెన్సీ పదకొండు మండలాలకు 43 వేల జాతీయ జె ండాలు, వాటికి అవసరమైన కర్రలను ఎంపీడీవోలకు అందజేశామన్నారు. ఎంపీడీవో కార్యాలయాల నుంచి వాటిని గ్రామ సచివాలయాలకు పంపించాలన్నారు. అలాగే ఏజెన్సీలో సెల్‌ నెట్‌ వర్క్‌ పెంచేందుకు 650 జియో టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని, 162 టవర్ల ఏర్పాటుకు అనుమతి వచ్చిందని, వాటిలో 24 టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాల కేటాయింపు ఈనెల 16 నాటికి పూర్తి చేయాలని తహసీల్దార్లను పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.దయానిధి, ఐటీడీఏ ఏపీవో వీఎస్‌ ప్రభాకరరావు, ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు  పాల్గొన్నారు. 

బస్టాండ్‌ వద్ద మానవహారం

గూడెంకొత్తవీధి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ 234బెటాలియన్‌ ఎఫ్‌ కంపెనీ జవాన్లు గురువారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో ఇమ్మానుయేలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:27:01+05:30 IST