ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2022-08-11T06:19:49+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జేసీ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
చిత్తూరు ఇన్‌చార్జి ఎంపీడీవోకు జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న జేసీ తదితరులు

3 లక్షల జెండాలు పంపణీ చేయనున్నట్లు జేసీ వెల్లడి 

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జేసీ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. జిల్లాకు 3 లక్షల జాతీయ జెండాలను ప్రభుత్వం పంపిందన్నారు. వీటిని సచివాలయాలు ద్వారా, వలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. గురు, శుక్రవారాల్లో వీటి పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎగుర వేసిన జాతీయ జెండా వద్ద సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాతో పోస్ట్‌ చేసి జాతీయ భావాన్ని చాటుకోవాలన్నారు. అలాగే గురువారం ‘హెరిటేజ్‌ వాక్‌’ పేరిట నగరంలోని పురాతన కట్టడాలు, వాటి విశిష్టతను విద్యార్థులకు,  ప్రజలకు తెలియజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీడీవో శివరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:19:49+05:30 IST