APలో త్వరలో అద్భుతం జరగబోతోంది: పవన్

ABN , First Publish Date - 2022-05-08T21:40:21+05:30 IST

ఏపీలో త్వరలో అద్భుతం జరగబోతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

APలో త్వరలో అద్భుతం జరగబోతోంది: పవన్

అమరావతి: ఏపీలో త్వరలో అద్భుతం జరగబోతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పొత్తులపై చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని ఆకాంక్షించారు. ఏపీ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని కోరారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రోడ్‌ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామని తెలిపారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని పవన్‌కల్యాణ్ తెలిపారు.



Read more