SBI Customer Alert: మీరు ఎస్‌బీఐ కస్టమరా.. కొంపదీసి మీకు ఈ మెసేజ్ వచ్చిందా..?

ABN , First Publish Date - 2022-05-22T23:11:08+05:30 IST

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఖాతా ఉందా..? మీ SBI Account Block అయినట్లు మీకేమైనా SMS వచ్చిందా..? ఒకవేళ ఇలాంటి మెసేజ్ గానీ మీకు వచ్చినట్లయితే..

SBI Customer Alert: మీరు ఎస్‌బీఐ కస్టమరా.. కొంపదీసి మీకు ఈ మెసేజ్ వచ్చిందా..?

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఖాతా ఉందా..? మీ SBI Account Block అయినట్లు మీకేమైనా SMS వచ్చిందా..? ఒకవేళ ఇలాంటి మెసేజ్ గానీ మీకు వచ్చినట్లయితే అప్రమత్తతతో వ్యవహరించాల్సిందే. SBI SMS మాదిరిగా అకౌంట్ బ్లాక్ అయిందని మెసేజ్ వస్తే ఆ SMS పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. నిజంగా SBI పంపినట్టుగానే ఒక ఫేక్ SMS కొందరు కస్టమర్లకు వచ్చిందని, కానీ ఆ SMSను ఎస్‌బీఐ పంపలేదని.. కొందరు సైబర్ నేరగాళ్ల పనిగా పేర్కొంది. ఇలాంటి ఫేక్ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ విషయంలో కస్టమర్లు ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరించింది. తొందరపడి ఆ Fake SMS లేదా Fake Emailsకు స్పందిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపింది. అంతేకాదు.. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాల విషయంలో గోప్యత పాటించాలని, Share చేయవద్దని సూచించింది.



ఎస్‌బీఐ కస్టమర్లకు ‘Dear A/c Holder Your SBI Bank Documents has expired A/c will be Blocked Now Click https://sbikvs.II Update by Net Banking’ అని SMS వస్తే మాత్రం అస్సలు స్పందించకండి. ఈ SMS ఒకవేళ SBI కస్టమర్లలో ఎవరికైనా వస్తే తక్షణమే report.phishing@sbi.co.inలో రిపోర్ట్ చేయాల్సిందిగా PIB పేర్కొంది. PIBFactCheckలో ఈ SMS ఫేక్ అని తేలింది. SBI ఇలాంటి SMSను పంపలేదని తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు ప్రచారంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదు. RBI KYS Norms పాటించకపోవడం వల్ల మీ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నామని కొందరు ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ సంవత్సరం మార్చిలో కూడా ఫేక్ SMSలు వచ్చాయి.

Updated Date - 2022-05-22T23:11:08+05:30 IST