మెడికల్‌ కల సాకారం

ABN , First Publish Date - 2022-08-11T06:58:15+05:30 IST

ఎట్టకేలకు నిర్మల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చే సింది. ఏళ్ల నుంచి జిల్లా ప్రజలు మెడికల్‌ కాలేజీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత ను సంతరించుకుంటోంది. గతంలో సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డిలు ఇచ్చిన హామీ మేరకు మెడికల్‌ కాలేజీ మంజూరు కావడం అంతటా హర్షాతిరేకాలకు కారణమవుతోంది. మెడికల్‌ కాలేజీ ఏ ర్పాటుతో జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి జిల్లా కేంద్ర ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీ పరిధిలోకి చేర్చనున్నారు.

మెడికల్‌ కల సాకారం
నిర్మల్‌ పట్టణంలోని దివ్యనగర్‌ కాలనీలో కొనసాగుతున్న నూతన జిల్లా ఆసుపత్రి భవన పనులు

కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం 

పేదలకు ఇక అందుబాటులోకి కార్పొరేట్‌ వైద్యం 

వచ్చే ఏడాది నుంచి తరగతుల ప్రారంభం 

రూ.166 కోట్ల నిధులు మంజూరు 

నిర్మల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు నిర్మల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చే సింది. ఏళ్ల నుంచి జిల్లా ప్రజలు మెడికల్‌ కాలేజీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత ను సంతరించుకుంటోంది. గతంలో సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డిలు ఇచ్చిన హామీ మేరకు మెడికల్‌ కాలేజీ మంజూరు కావడం అంతటా హర్షాతిరేకాలకు కారణమవుతోంది. మెడికల్‌ కాలేజీ ఏ ర్పాటుతో జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి జిల్లా కేంద్ర ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీ పరిధిలోకి చేర్చనున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్‌ నుంచి తప్పించి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప రిధిలోకి తీసుకువచ్చారు. గతంలో సీఎం మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరవ మేరకు జిల్లా యంత్రాంగం 22 ఎకరాలకు పైగా స్థలాన్ని మెడికల్‌ కా లేజీ ఏర్పాటు కోసం సేకరించింది. జిల్లాకేంద్రంలో అన్ని రకాల సౌకర్యా లు అందుబాటులో ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభు త్వం మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌ సేవలు, డయాగ్నోస్టిక్‌ హబ్‌తో పాటు సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా అ త్యవసర పరిస్థితుల్లోనూ సూపర్‌ స్పె షాలిటీ వైద్యం అవసరమయ్యే సమయంలోనూ జిల్లా వాసులు నిజామాబాద్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా నిర్మల్‌ జి ల్లాకేంద్రం నేషనల్‌ హైవేపై ఉన్న కారణంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సలు అందడం లేదు. దీని కారణంగా ప్రజలు గాయాలతో ప్రాణాలు సైతం కోల్పోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇ క్కడి ప్రజలకు ఉన్నతస్థాయి వైద్యం అందుబాటులో లేని కారణంగా తరుచూ సమస్యలు ఏర్పడడం, ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం సాధారణమై పోయింది. ఇలా ఉన్నతస్థాయి వైద్యం జిల్లాకు అత్యవసరమైన కారణంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. గత సంవత్సరమే మెడికల్‌ కాలేజీకి మంజూరు లభిస్తుందని ఆశించిన స్థా నికులు అప్పటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరాశకు గురయ్యా రు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ సారి మెడికల్‌ కాలేజీని మంజూరు చే యడమే కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. మూడు సంవత్సరాల పాటు ఎలాంటి అ భ్యంతరాలు లేకుండా తరగతులను నిర్వహణకు అనుమతినిచ్చింది.  మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రూ.166 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 

అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం

జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కారణంగా ఇక పేద ప్రజలందరికీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తు తం నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపైనే కాకుండా భైంసా వైపు, మంచిర్యాల వైపు వెళ్లే ప్రధాన రోడ్లపై రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి ఇక్కడ అత్యవసర చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెడికల్‌ కాలేజీ ఏర్పాటైనట్లయితే అత్యవసర చికిత్సలు ఇక అందుబాటులోకి రానున్నాయి. అలాగే కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ర్టోఎట్రాలజీ, గైనకాలజీ లాంటి వైద్య సేవలు మెడికల్‌ కాలేజీ ద్వా రా పేద ప్రజలకు చేరువకానున్నాయి. అన్ని వ్యాధులకు స్పెషలిస్టు వై ద్యులు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలందరికీ రౌండ్‌ ద క్లాక్‌ ప ద్ధతిలో వైద్య సేవలు అందుతాయంటున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం..

2023 సంవత్సరం నుంచి మెడికల్‌ కాలేజీకి సంబంధించిన తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇక్కడి జిల్లా ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీకి అటాచ్‌ చేస్తూ దాని పరిధిని వైద్య విధాన పరిషత్‌ నుంచి తప్పిం చి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. 100 సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చిం ది. వరుసగా ప్రతి ఏటా వందమంది విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కా లేజీలో సీట్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో మెడికల్‌ కాలేజీ కొనసాగుతుండగా ఇటీవల ఆసిఫాబాద్‌లో కూడా మెడికల్‌ కాలేజీ ఏర్పాటయ్యింది. 

రూ.166 కోట్ల మంజూరు..

ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ కోసం రూ.166 కోట్లను మంజూరు చే సింది. భవన నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. దీనికి తోడుగా ఫర్నీచర్‌, ఇతర మెడికల్‌ ఎక్విఫ్‌మెంట్‌ సౌకర్యాలను స మకూర్చే బాధ్యత టీఎస్‌ఎంఐడీసీ పరిధిలోకి చేర్చారు. ఇప్పుడు ప్రస్తు తం ఒకేచోట జిల్లా ఆసుపత్రితో పాటు మెడికల్‌ కాలేజీ కొనసాగే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

Updated Date - 2022-08-11T06:58:15+05:30 IST