భవిష్యత్‌కు ఉపయోగపడేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలి

ABN , First Publish Date - 2022-10-01T03:21:07+05:30 IST

మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కలెక్టర్‌ భార తి హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో 5 మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్‌పర్సన్‌లు, సంబంఽధిత అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

భవిష్యత్‌కు ఉపయోగపడేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  30: మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కలెక్టర్‌ భార తి హోళికేరి అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో 5 మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్‌పర్సన్‌లు, సంబంఽధిత అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన పురపాలక చట్టం ప్రకారం పట్టణాభివృద్ధి పనులు చేపట్టాల న్నారు. వచ్చే వారం ఎన్‌ఐఏ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుందన్నారు.  అధికారులు సోమవారంలోగా పట్టణ జనాభా, వాటర్‌ తదితర ప్రణాళికలపై ప్రతిపాదనలు అందించాలన్నారు. భూములపై క్షుణ్ణంగా పర్యవేక్షించి ఎలాంటి తప్పులు లేకుండా ప్లాన్‌ రూపొందించాలని తెలిపారు. ప్లాన్‌ ఆచరణకు ముందు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.   

నిర్మాణపనులు పకడ్బందీగా చేపట్టాలి

దండేపల్లి: మనఊరు మనబడి పథకం ద్వారా ఎంపికైన మామిడిపల్లి, దండేపల్లి, మోకాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టే నిర్మాణ పనులను నాణ్యతో గడువులోగా పకడ్బందీగా చేప ట్టాలని కలెక్టర్‌ భారతి హోళీకేరి అధికారులను ఆదే శించారు. మోకాసిగూడ, మామిడిపల్లి, దండేపల్లి పాఠశాలలను శుక్రవారం సందర్శించి నిర్మాణ పను లను   పరిశీలించారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై మీరు ఏమి చేస్తున్నారని అధికా రులపై మండిపడ్డారు. పాఠశాలలో శిధిలావస్ధలో ఉన్న తరగతి గదుల తొలగింపు, మరుగుదొడ్ల మరమ్మతు సకాలం లో పూర్తి చేయాలన్నారు.  జిల్లా లో 248 పాఠశాలను ఎంపిక ఛేశామన్నారు. పాఠశాలలో జరి గే నిర్మాణ పనులపై అసంపూర్తి వ్యక్తం చేశారు.  ఎంపీపీ శ్రీని వాస్‌, ఎంపీడీవో మల్లేషం, సర్పం చులు చంద్రకళ, ప్రేమల, శ్యామ ల, కార్యదర్శులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-01T03:21:07+05:30 IST