ముక్కులోంచి గాలి వెళ్లడం లేదని ఆస్పత్రికెళ్లిన 38 ఏళ్ల వ్యక్తి.. టెస్టుల్లో లోపల ఏముందో తెలిసి అవాక్కైన డాక్టర్లు

ABN , First Publish Date - 2022-02-24T21:36:12+05:30 IST

ముక్కలోంచి గాలి వెళ్లక పోవడంతో కొన్నేళ్లుగా సతమతం అవుతున్న ఓ వ్యక్తి తాజాగా వైద్యులను సంప్రదించాడు. ఈ క్రమంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం

ముక్కులోంచి గాలి వెళ్లడం లేదని ఆస్పత్రికెళ్లిన 38 ఏళ్ల వ్యక్తి.. టెస్టుల్లో లోపల ఏముందో తెలిసి అవాక్కైన డాక్టర్లు

ఇంటర్నెట్ డెస్క్: ముక్కలోంచి గాలి వెళ్లక పోవడంతో కొన్నేళ్లుగా సతమతం అవుతున్న ఓ వ్యక్తి తాజాగా వైద్యులను సంప్రదించాడు. ఈ క్రమంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం అతడికి శస్త్ర చికిత్స చేసి పరిస్థితి మెరుగుపరిచారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


న్యూయార్క్‌కు చెందిన38 ఏళ్ల వ్యక్తి కొద్ది రోజులుగా వింత సమస్యతో బాధపడుతున్నడు. ముక్కులోంచి గాలి తీసుకోలేక కొన్నేళ్లుగా ఇబ్బందిపడుతున్న అతడు.. ఇంత కాలం దాన్ని పెద్దగా పట్టించులేదు. అయితే ఇటీవల సమస్య మరింత ఎక్కువ కావడంతో.. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లకు తన సమస్యను వివరించడంతో.. వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. సమస్యను గుర్తించి ఒక్కసారిగా షాకయ్యారు. అతడి కుడి నాసికా కుహరంలో దంతం పెరిగుతున్నట్టు గుర్తించి అవాక్కయ్యారు. అనంతరం అతడికి శస్త్ర చికిత్స నిర్వహిచి.. సుమారు 14 మిల్లీమీటర్ల పొడవున్న దంతాన్ని తొలగించారు. మరి కొద్ది రోజుల్లో అతడి పరిస్థితి మెరుగుపడుతుందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఈ విషయం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితం కావడంతో వెలుగులోకి వచ్చింది. 



అయితే ముక్క కుహరాల్లో దంతాలు పెరగడం అనేది చాలా అరుదుగా జరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం జనాభాలో 0.1 నుంచి 1% మంది మాత్రమే ఇటువంటివి సమస్య బారినపడతారని తెలుపుతున్నారు. మహిళలతో పోల్చితే పురుషుల్లోనే ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. ఇదిలా ఉంటే.. 2019లో డెన్మార్క్‌కు చెందిన 59ఏళ్ల వ్యక్తి కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. 




Updated Date - 2022-02-24T21:36:12+05:30 IST