జులాయిగా తిరిగే తమ్ముడిని బయటకు గెంటేసిన అన్న.. ఆగ్రహించిన తమ్ముడు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-10T22:53:21+05:30 IST

అతను ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు.. తాగేసి చుట్టుపక్కల వారితో గొడవలు పడుతుంటాడు..

జులాయిగా తిరిగే తమ్ముడిని బయటకు గెంటేసిన అన్న.. ఆగ్రహించిన తమ్ముడు ఎంత పని చేశాడంటే..

అతను ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు.. తాగేసి చుట్టుపక్కల వారితో గొడవలు పడుతుంటాడు.. అతడి ఆగడాలు పెచ్చు మీరడంతో అతడి అన్నయ్య సహనం కోల్పోయాడు.. తమ్ముడిని ఇంటి నుంచి బయటకు తరిమేశాడు.. ఉన్న ఆస్తి పంచేసి ఇస్తానన్నాడు.. దీంతో ఆగ్రహించిన తమ్ముడు అన్నపై కోపం పెంచుకున్నాడు.. అన్న లేనప్పుడు అతడి ఇంటిని తగలబెట్టాడు. 


హర్యానాలోని పానిపట్‌లోని దిననాథ్ కాలనీకి చెందిన ఖుర్షీద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. అతను తమ్ముడు ముక్తుమ్ మాత్రం బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ చుట్టుపక్కల వారితో గొడవలు పడుతుంటాడు. డబ్బుల కోసం అన్నను, తల్లిని వేధిస్తుంటాడు. వారు ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్లి అమ్మేస్తుంటాడు. ముక్తుమ్ ఆగడాలు పెచ్చుమీరడంతో ఖుర్షీద్ సహనం కోల్పోయాడు. 


తమ్ముడిని ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. ఉన్న కొద్ది ఆస్తిలో వాటా ఇచ్చేస్తానని, బయటకు వెళ్లి బతకమని చెప్పాడు. దీంతో ముక్తుమ్ తన అన్నపై పగ పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేనపుడు లోపలికి వెళ్లి సామాన్లను తగలబెట్టాడు. విలువైన వస్తువులను పట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న ఖుర్షీద్.. ముక్తుమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముక్తుమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-01-10T22:53:21+05:30 IST