భార్యను కాటేసిన పాము.. భర్త చేసిన పనికి డాక్టర్లు షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న అతడి వ్యవహారం

ABN , First Publish Date - 2022-06-25T14:05:29+05:30 IST

పాములు ఇళ్లలో దూరి ఇంట్లో ఉన్న వారిని కాటేసిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన ఓ పాము.. భార్యను కాటేసింది. అది తెలిసి..

భార్యను కాటేసిన పాము.. భర్త చేసిన పనికి డాక్టర్లు షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న అతడి వ్యవహారం

ఇంటర్నెట్ డెస్క్: పాములు ఇళ్లలో దూరి ఇంట్లో ఉన్న వారిని కాటేసిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన ఓ పాము.. భార్యను కాటేసింది. అది తెలిసి.. ఆమెను తన భర్త జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇందులో వింత ఏముంది.. సాధారణంగా అందరూ ఈ పనే చేస్తారు కదా అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ భర్త తన భార్యతో పాటు పామును కూడా సజీవంగా ఆసుపత్రికి పట్టుకెళ్లాడు. దీంతో అతడు చేసిన పనికి డాక్టర్లు షాకయ్యారు. అనంతరం.. ‘దాన్నెందుకు పట్టుకొచ్చావ్’ అని ప్రశ్నించిన డాక్టర్లు.. అతడి సమాధానం విని మరింత ఆశ్చర్యపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రామేంద్ర యాదవ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ మాఖీ పోలీస్ స్టేషల్ పరిధిలోని అఫ్జల్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి శుక్రవారం తెల్లవారు జామున ఓ పాము దూరింది. అనంతరం.. రామేంద్ర యాదవ్ భార్యను కాటేసింది. దీంతో అతడు తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ.. ఆమెను కాటేసిన పామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించి.. దాన్ని కూడా పట్టుకెళ్లాడు. ఈ క్రమంలో రామేంద్ర యాదవ్ భార్యను అడ్మిట్ చేసుకున్న జిల్లా ఆసుపత్రి వైద్యులు.. అతడు పామును తీసుకొచ్చిన విషయం తెలిసి షాకయ్యారు. ఈ నేపథ్యంలో ‘పామును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్’ అని అతడిని ప్రశ్నించారు. దీంతో అతడు బుర్ర తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. ‘ఏ పాము కాటేసింది అని అడిగితే ఎలా అని.. దాన్ని స్వయంగా మీకే చూపిద్దామని తీసుకొచ్చా’ అని చెప్పడంతో డాక్టర్లు మరింత షాకయ్యారు. కాగా.. రామేంద్ర భార్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే ఆ పామును అతడు దగ్గర్లోని అడవిలో వదిలేశాడు. మొత్తానికి రామేంద్ర యాదవ్ చేసిన పని.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-06-25T14:05:29+05:30 IST