కళ్లు చెదిరే రీతిలో రోజుకు 153 కోట్ల రూపాయలను సంపాదిస్తున్న ఈ రైతు బిడ్డ ఎవరంటే..

ABN , First Publish Date - 2021-10-02T03:02:16+05:30 IST

అదో మారుమూల గ్రామం.. దేశంలో చాలా ఊళ్లను తాకిన తర్వాతే విద్యుత్ వెలుగులు ఆ ఊరిలోకి ప్రవేశించాయి. మంచి నీళ్లు కూడా ఆ ఊరి ప్రజలను ఆలస్యంగానే కనికరించాయి. వ్యవసాయం తప్ప ఆ గ్రామ ప్రజలకు వేరే ఏమీ తెలియదు. అటువంటి మారుమూల పల్లె‌కు చెం

కళ్లు చెదిరే రీతిలో రోజుకు 153 కోట్ల రూపాయలను సంపాదిస్తున్న ఈ రైతు బిడ్డ ఎవరంటే..

ఇంటర్నెట్ డెస్క్: అదో మారుమూల గ్రామం.. దేశంలో చాలా ఊళ్లను తాకిన తర్వాతే విద్యుత్ వెలుగులు ఆ ఊరిలోకి ప్రవేశించాయి. మంచి నీళ్లు కూడా ఆ ఊరి ప్రజలను ఆలస్యంగానే కనికరించాయి. వ్యవసాయం తప్ప ఆ గ్రామ ప్రజలకు వేరే ఏమీ తెలియదు. అటువంటి మారుమూల పల్లె‌కు చెందిన ఓ వ్యక్తి.. ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. రోజుకు రూ.153కోట్లను సంపాదిస్తూ.. భారత అంత్యంత ధనవంతుల జాబితాలో 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి.. కళ్లు చెదిరే రీతిలో సంపదను ఆర్జిస్తున్న ఆయన పేరు జై చౌదరి. ఈయన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021’ నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో కనీసం రూ.1,000 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య తొలిసారిగా 1,000 మైలురాయిని దాటింది. గత ఏడాదితో పోల్చితే, వీరి సంఖ్య 179 పెరిగి 1,007కు చేరుకుంది. కాగా.. ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో జై చౌదరి పదవ స్థానంలో నిలిచారు. హాకర్ల నుంచి ముప్పు పెరుగుతున్న క్రమంలో సైబర్ సెక్యురిటీకి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జై చౌదరికి చెందిన జెడ్‌స్కేలర్‌ (Zscaler) కంపెనీ భారీగా లాభాలను ఆర్జిచింది. దీంతో గత ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 85శాతం పెరిగింది. ఈ క్రమంలో ఆయన రూ.1,21,600 కోట్ల సంపదను సృష్టించారు. 


హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ రాష్ట్రాల సరిహదుల్లో ఉన్న పనోహ్ అనే మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో జై చౌదరి జన్మించారు. 8వ తరగతి వరకూ దీపపు వెలుగల మధ్యే ఆయన పుస్తకాలతో కుస్తీ పట్టారు. 10 తరగతి వరకూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి తాగి నీటి కోసం యుద్ధమే చేశారు. ఇలా ఎన్నో సమస్యలతో సతమవుతూనే ఐఐటీ వారణాసీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బ్యాచ్‌లర్ డ్రిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఉన్నత చదువులు కోసం అమెరికాలోని ఓ యూనివర్సీటిలో అప్లై చేశారు. ఈ క్రమంలోనే కొందరు సహాయం చేయడం ద్వారా అమెరికాకు పయనమై.. జై చౌదరి అక్కడ ఉన్నత చదువును పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు ఆయన పలు కంపెనీల్లో పని చేశారు. అనంతరం అతని భార్య జ్యోతి చౌదరితో కలిసి సెక్యూర్‌ఐటీ అనే సంస్థను స్థాపించారు. ఈ క్రమంలోనే 2007 జెడ్‌స్కేలర్‌ను నెలకొల్పారు. కాగా.. ఈ కంపెనీలో జై చౌదరికి 42శాతం వాటా ఉంది. 


Updated Date - 2021-10-02T03:02:16+05:30 IST