Advertisement
Advertisement
Abn logo
Advertisement

25 ఏళ్ల కుర్రాడు.. పెళ్లయిన వారానికే ఉపాధి కోసం సిటీకి.. 6 నెలల తర్వాత తిరిగొస్తే ఊహించని షాకిచ్చిన భార్య.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఆ కుర్రాడి వయసు 25 ఏళ్లు. పొట్టకూటి కోసం పెళ్లయిన వారానికే భార్యను సొంతూర్లోనే ఉంచి అతడు ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు. కొద్ది మొత్తంలో నగదు సంపాదించుకుని ఆరు నెలల తర్వాత సొంతూరికి తిరిగొచ్చాడు. అనంతరం పుట్టింటికి వెళ్లిన భార్యను తన ఇంటికి తీసుకెచ్చేందుకు ఊరెళ్లాడు. అక్కడ ఆమె ఓ షాకింగ్ విషయం చెప్పడంతో అతడు కంగుతిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన జితేంద్ర దాస్‌కు ఆరు నెలల క్రితమే ఓ మహిళతో పెళ్లైంది. పెళ్లయిన వారానికే.. అతడు తన భార్యను సొంతూర్లోనే వదిలి ఉపాధి కోసం సిటీ వెళ్లాడు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ నాలుగు డబ్బులు వెనకేశాడు. ఖర్చులకు పోనూ కొంత మొత్తాన్ని పొదుపు చేసుకున్న అతడు.. ఆరు నెలల తర్వాత సొంతూరుకి బయల్దేరాడు. అనంతరం తన భార్య పుట్టింటికి వెళ్లినట్టు తెలుసుకుని.. ఆమెను తన ఇంటికి తీసుకొచ్చేందుకు అక్కడకు వెళ్లాడు. ఈ క్రమంలో భార్య నుంచి వచ్చిన మాటలను విని అతడు కంగుతిన్నాడు. 


తనతోపాటు వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో షాకయ్యాడు. దీంతో తీవ్ర మనస్తపం చెంది.. శనివారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తమకు ఇంకా అందలేదని చెప్పారు. అంతేకాకుండా.. దీనిపై ఇప్పటి వరకూ ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement