కదిరిఅర్బన : మండల పరిధిలోని గొల్లోచెరువుకు చెం దిన మీసాల సుధాకర్ (52) ఎద్దుల బండి కింద పడి శుక్రవారం మరణించాడు. సుధాకర్ తల్లి ఇటీవలే మర ణించింది. ఆమె సమాధి నిర్మాణానికి శుక్రవారం రాత్రి కప్పులు బండికి ఎత్తుతుండగా, ఉన్నఫలంగా ఎద్దులు ముందుకెళ్లడంతో బండి టైర్ కింద పడి సుధాకర్ మరణించాడు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు .. కేసు దర్యాప్తు చేపట్టారు.