Viral News: పెద్ద మిస్టేక్ చేసిన Google.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సామాన్యుడు!

ABN , First Publish Date - 2022-09-18T17:18:08+05:30 IST

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల జాబితాలో గూగుల్ కూడా ఒకటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఈ టెక్ దిగ్గజం ఓ పెద్ద మిస్టేక్ చేసింది. ఫలితంగా ఓ సామాన్యుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అ

Viral News: పెద్ద మిస్టేక్ చేసిన Google.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సామాన్యుడు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల జాబితాలో గూగుల్ కూడా ఒకటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఈ టెక్ దిగ్గజం ఓ పెద్ద మిస్టేక్ చేసింది. ఫలితంగా ఓ సామాన్యుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో Google చేసిన ఆ మిస్టేక్ ఏంటి? రాత్రికి రాత్రే సామాన్యుడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే వివరాలను ఓసారి పరిశీలిస్తే..


అమెరికాకు చెందిన సామ్ కర్రీ(Sam Curry) అనే వ్యక్తి ఒక సామాన్యుడు. హ్యాకర్‌గా పని చేస్తున్న ఇతడు.. ఐటీ సంస్థల కోరిక అప్పుడప్పుడూ వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లలో బగ్‌లను గుర్తించి చెబుతూ ఉంటాడు. అందుకు ప్రతిఫలంగా డబ్బులు పొందుతాడు. దిగ్గజ సంస్థ Google కోసం కూడా ఇతడు గతంలో పని చేశాడు. ప్రస్తుతం గూగుల్‌కు సంబంధించిన ఏ ప్రాజెక్ట్‌పై ఇతడు పని చేయడం లేదు. కానీ.. మూడు వారాల క్రితం ఇతడి Bank Accountలో దాదాపు రూ.2కోట్ల విలువగల అమెరికా డాలర్లను జమ చేసింది. 



ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో డబ్బు తన బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ కావడంతో సామ్ కర్రీ షాకయ్యాడు. గూగుల్‌ నుంచి ఈ డబ్బులు వచ్చినట్టు గ్రహించి.. విషయాన్ని టెక్ దిగ్గజం ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో గూగుల్(Google mistake) చేసిన పొరపాటును గ్రహించింది. వేరొకరి అకౌంట్లో ఈ డబ్బులను జమ చేయబోయి.. సామ్ కర్రీ అకౌంట్లో జమ చేసినట్టు చెప్పింది. విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకెళ్లినందుకుగాను అతడికి ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా అతడు స్పందిస్తూ.. గూగుల్ జమ చేసిన డబ్బును అస్సలు టచ్ చేయలేదని చెప్పాడు. తర్వాత గూగుల్ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించాడు. కాగా.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌(Viral)గా మారింది. 


Updated Date - 2022-09-18T17:18:08+05:30 IST