Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా సద్దుల సంబురం

బాన్సువాడ, అక్టోబరు 14: పట్టణంలోని పురపాలక సంఘం పరిధిలో పాత బాన్సువాడలో బతుకమ్మ సంబరాల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. పాత బాన్సువాడ చావిడి దగ్గర, హరిజనవాడ, సంగమేశ్వర చౌరస్తా, చైతన్య కాలనీ, పలు ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. చావిడి దగ్గర స్పీకర్‌ పోచారం బతుకమ్మ పండుగను, పండుగ ప్రాముఖ్య తను, తెలంగాణ సంస్కృతిని వివరిస్తూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హరిజనవాడలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, చిన్నారులతో కలిసి కాసేపు కోలాటం ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగా ధర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, బాన్సువాడ సొసైటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు గురువినయ్‌, ఎజాజ్‌, పోతురెడ్డి, కనుకుట్ల రాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దాసరి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు లింగమేశ్వర్‌, రవీందర్‌రెడ్డి, రమాదేవి రాజాగౌడ్‌, నర్సుగొండ, వెంకటేశ్‌, బాబా, నాయకులు, కార్యకర్తలు తదితరు లున్నారు.
లింగంపేటలో..
లింగంపేట: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సద్దుల బతు కమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మోతె, ఐలాపూ ర్‌లతో పాటు పలు గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిం చారు. మోతెలో జడ్పీటీసీ శ్రీలత బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఐలాపూర్‌ చెరువు కట్టపై సిమెంట్‌తో నిర్మించిన బతుకమ్మకు ప్రత్యేక రంగులు, విద్యుత్‌ దీపాలతో అలంకరించి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ప్రకృతి ప్రసాదించిన పూలను పూజించి బతుకమ్మలను చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బతుకమ్మ పోటీలను నిర్వహించి అందమైన బతుకమ్మలకు బహుమతు లను అందజేశారు. బతుకమ్మ పాటలతో మహిళలు ఆడుతూ, పాడుతూ అనందగా గడిపారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి: మండలంలోని నందివాడ, కరడ్‌పల్లి, దేమికలాన్‌ గ్రామాల్లో గురువారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించి పాటలు పాడారు.
గాంధారిలో..
గాంధారి: మండలంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబరాలను నిర్వహించారు. బతుకమ్మ ఆడిన అనంతరం వాగు ఒడ్డున బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చుకున్నారు. సకుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కల్యాణి, గండిమాసానిపేట్‌, లక్షాపూర్‌, తిమ్మారెడ్డి తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహించారు. యువతులు కోలలు వేస్తూ బతుకమ్మలను ఆడగా, చిన్నారులు కేరింతలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement