అసమానతపై తిరగబడిన అక్షరయోధుడు

ABN , First Publish Date - 2021-07-25T04:47:30+05:30 IST

అసమానతలపై తిరగబడిన అక్షరయోఽధుడు గుర్రంజాషువా అని సామాజిక చైతన్య సమితి రాష్ట్ట్ర అధ్యక్షు డు మురళీధర్‌ పేర్కొన్నారు.

అసమానతపై తిరగబడిన అక్షరయోధుడు

బద్వేలు రూరల్‌, జూలై 24: అసమానతలపై తిరగబడిన అక్షరయోఽధుడు గుర్రంజాషువా అని సామాజిక చైతన్య సమితి రాష్ట్ట్ర అధ్యక్షు డు మురళీధర్‌ పేర్కొన్నారు. గుర్రంజాషువా వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావకవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారన్నారు.  కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢచారాలపై తిరగబడ్డారన్నారు. శాసనమండలి సభ్యునిగా మూఢచారాలపై పోరాటాలు జరిపిన యోధుడు గుర్రంజాషువా అన్నారు. సామాజిక చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి బ్రహ్మయ్య, రాంబాబు, విజయ్‌, శ్రీను పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠం, జూలై 24: ఆదిజాంబవ అరుంధతీ అన్నదాన సత్రం ప్రాంగణలో శనివారం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో గుర్రంజా షువా వర్ధంతిని చేపట్టారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నేత దండోరా చండ్రాయుడు మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొంది న కవి గుర్రం జాషువా అని, కవుల్లో గుర్రం జాషువాకు ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ నేతలు జ్ఞానేశ్వరరావు నారాయణ, పీటర్‌, పుల్లయ్య, రామాంజనేయులు, మండల ప్రధాన కా ర్యదర్శి ఓబయ్య, హరిబాబు, సుబ్బరాయుడు, రాయప్ప పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T04:47:30+05:30 IST