Abn logo
Oct 24 2020 @ 05:51AM

ప్రాణం తీసిన మద్యం పందెం

నీరు కలుపకుండా ఫుల్‌ బాటిల్‌ మద్యం తాగి ఒకరి మృతి


బాన్సువాడ, అక్టోబరు 23 : సరదాగా స్నేహితులు వేసు కున్న బెట్టింగ్‌ ఒకరి ప్రాణాలు తీసిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణ ంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన సోమేశ్వరం సాయిలు (40) తన స్నేహితులతో కలిసి ఫుల్‌ బాటిల్‌ మద్యంలో నీరు కలుపుకోకుండా తాగేందుకు బెట్టింగ్‌ వేశాడన్నారు. పాత బాన్సువాడలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన సాయిలు గురు వారం ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో భార్య గంగామణికి చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం ఫోన్‌ చేయగా తర్వాత వస్తానని చెప్పాడని వివరించారు. కాగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో గల్లీవాసులైన పలువురు తాగి పడి ఉన్న సాయిలును ఇంటికి తీసుకుని వచ్చారన్నారు. ఇంటికి తీసుకుని వచ్చిన కొద్ది సేపటికే నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నట్లు తెలిపారు. సాయంత్రం 7.30గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. శుక్రవారం భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేష్‌గౌడ్‌ వివరించారు. మృతుడికి ఒక కుమా రుడు, ఒక కూతురు ఉన్నారు.

Advertisement
Advertisement