Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీడెవడండీ బాబూ.. ఊళ్లో ఎవరెవరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయో తెలుసా అంటూ పేర్లతో సహా లేఖలో రాసి..

ఒక లేఖ ఆ గ్రామంలోని మహిళలందరినీ ఉలిక్కిపాటుకు గురి చేసింది.. ఆగ్రహంతో ఊగిపోయేలా చేసింది.. అందరూ రోడ్డెక్కి ధర్నా చేసేలా చేసింది.. పోలీసులు వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు.. నిందితుడిని అరెస్ట్ చేసే వరకు విశ్రమించేది లేదని వారంతా రోడ్డుపైనే బైఠాయించారు.. ఆ మహిళలందరి ఆగ్రహానికి కారణం అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి రాసిన లేఖ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


ఊర్లోని మహిళల్లో ఎవరెవరికి ఎవరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయో పేర్కొంటూ రాసిన లేఖ జవాద్ గ్రామంలో కలకలం రేపింది. గ్రామంలోని 200 మంది మహిళలకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ గత నెలలో ఓ లేఖ గ్రామస్థులకు పోస్ట్ ద్వారా అందింది. ఆ లేఖ గుజరాతీ, హిందీ బాషలలో ఉంది. దీంతో ఆ లేఖలో పేర్లు ఉన్న మహిళలందరూ గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లేఖను తమ గ్రామానికి చెందిన భన్సీలాల్ పనివాల్ అనే వ్యక్తి రాశాడని, వెంటనే అతనని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. 


ఆ ఫిర్యాదును పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తాజాగా మహిళలందరూ కలిసి కంక్రోలి-నత్‌ద్వారా రోడ్డును బ్లాక్ చేశారు. రోడ్డుపై కూర్చుని వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు మహిళలందరినీ బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో వారంతా భన్సీలాల్ ఇంటి ముందుకు చేరి నిరసన ప్రారంభించారు. కాగా, ఆ లేఖలోని దస్తూరీ ఎవరిదని తెలుసుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, ఆ చేతి రాత గ్రామస్థులు అనుమానిస్తున్న వ్యక్తిదే అని తేలితే కచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement