Viral Video: వ్యక్తిపై దాడి చేసిన కంగారూ.. పరుగెత్తుకుని మరీ వచ్చి ఒక్క తన్ను తన్నడంతో అతడు..

ABN , First Publish Date - 2022-02-25T21:53:14+05:30 IST

కంగారూ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిని ఒక్క తన్ను తన్నిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ వ్యక్తి కాంగారూ దగ్గరికి ఎందుకు వెళ్లాడు? అది అతడిపై ఎందుకు దాడి చేసిందనే పూర్తి వివరాల్లో

Viral Video: వ్యక్తిపై దాడి చేసిన కంగారూ.. పరుగెత్తుకుని మరీ వచ్చి ఒక్క తన్ను తన్నడంతో అతడు..

ఇంటర్నెట్ డెస్క్: కంగారూ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిని ఒక్క తన్ను తన్నిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ వ్యక్తి  కాంగారూ దగ్గరికి ఎందుకు వెళ్లాడు? అది అతడిపై ఎందుకు దాడి చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు కాబోలు ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరదాగా బయటికెళ్లాడు. స్థానికంగా ఉన్న ఫారెస్ట్‌లో తన కుక్కపిల్లలతో సహా తిరుగుతుండగా అతడికి కంగారూ ఎదురు పడింది. ఈ క్రమంలోనే అపాయం అని భావిస్తే తమ రక్షణ కోసం కంగారూలు ఇతరులపై దాడి చేస్తాయనే విషయం అతడికి గుర్తొచ్చింది. వెంటనే తన పెంపుడు కుక్కలతో సహా అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే ఆ కంగారూ అతడిని సమీపించింది. ఈ నేపథ్యంలో కంగారూ బారి నుంచి తన పెంపుడు కుక్కలను రక్షించేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించాడు. సరిగ్గా ఇదే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చిన కంగారూ.. ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఒక్క తన్ను తన్ని అతడిని కింద పడేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు లేనప్పటికీ.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది.






Updated Date - 2022-02-25T21:53:14+05:30 IST