చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి

ABN , First Publish Date - 2022-07-05T05:55:43+05:30 IST

గ్రామాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు స్థాయికి మించిన వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశా వర్కర్లు కృషి చేయాలని చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి అనిత

శివ్వంపేట, జూలై 4: గ్రామాల్లో  ఆర్‌ఎంపీ వైద్యులు స్థాయికి మించిన వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశా వర్కర్లు కృషి చేయాలని చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీకృషివిజ్ఞాన గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసచారి, కృషి విజ్ఞాన్‌ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లక్ష్మీకాంతారావు, సీఐ శ్రీధర్‌, వైద్యులు వెంకట్‌యాదవ్‌, విజయకుమార్‌, సంధ్యారాణి, నర్సాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-05T05:55:43+05:30 IST