ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మగలరా..? 6నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గి.. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-03-03T23:56:40+05:30 IST

అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. దీంతో కొందరు మధ్యలోనే నిరుత్సాహానికి గురై వెనుకడుగు వేస్తూ ఉంటారు. అనుకున్నది..

ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మగలరా..? 6నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గి.. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత..

అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. దీంతో కొందరు మధ్యలోనే నిరుత్సాహానికి గురై వెనుకడుగు వేస్తూ ఉంటారు. అనుకున్నది సాధించలేకపోయామన్న నిరాశతో మిగతా జీవితాన్ని గడిపేస్తుంటారు. మరికొందరు మాత్రం ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధించేవరకూ పట్టువదలకుండా ప్రయత్నిస్తుంటారు. చివరకు విజేతలుగా మిగిలిపోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ.. ఈ కోవకే చెందుతుంది. మోడలింగ్, జూనియర్ ఆర్టిస్టుగా దూసుకెళ్తున్న క్రమంలో ఆమె కెరీర్‌కు ఒక్క సారిగా బ్రేక్ పడింది. అనంతరం వివాహమై ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తన లక్ష్యాన్ని సాధించేందుకు చివరకు ఆరు నెలల్లోనే 16కేజీల బరువు తగ్గింది. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత ఆమె చేసిన ప్రయత్నం చివరకు ఏమైందో తెలుసుకుందాం..


రాజస్థాన్ జైపూర్‌కు చెందిన అంకితా శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి ఉండేది. తన 14ఏట నుంచే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. మరోవైపు జూనియర్ ఆర్టిస్టుగా కూడా అనేక చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలో 2002లో మిస్ జైపూర్, మిస్ రాజస్థాన్‌గా నిలిచింది. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  జైపూర్ వాసులు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఆమె జీవితం ఇలా సాగుతుండగా.. 2006లో 21ఏళ్ల వయసులో ఆమెకు జై శ్రీవాస్తవ అనే వ్యక్తితో వివాహమైంది. వివాహం అనంతరం కుటుంబ బాధ్యతలు మీద పడడంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంకిత భర్త కన్‌స్ట్రక్షన్ మేనేజర్‌గా పని చేస్తుండడంతో అనేక ప్రాంతాలు మారాల్సి వచ్చేంది. కొన్నేళ్లకు వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. దీంతో ఆమె మోడలింగ్‌కు పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. అయితే భర్త మాత్రం అంకితను ఎంతో ప్రోత్సహించాడు. ‘‘నువ్వు అనుకున్నది సాధించాలి’’.. అంటూ భరోసా ఇవ్వడంతో ఆమె మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది.

పెళ్లికాని కుర్రాళ్లే వీళ్ల టార్గెట్.. 11 రాష్ట్రాల్లో 1400 మంది బాధితులు.. ఫోన్ చేసి ఏం మాట్లాడతారంటే..!


పిల్లలు జన్మించిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. దీనికి తోడు ఆమె 72కేజీల బరువు ఉండేది. దీంతో ముందుగా ఎలాగైనా బరువు తగ్గాలని బలంగా నిర్ణయించుకుంది. మరోవైపు 2022 వీపీఆర్ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని భర్త, కుటుంబ సభ్యులు ఆమెను ప్రోత్సహించారు. దీంతో యోగా చేయడంతో పాటూ ఆహార నియమాలను కూడా పూర్తిగా మార్చేసింది. బియ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. జొన్న రోటీ, కూరగాయలను తదితర ఆహార పదార్థాలను తీసుకోవడం ప్రారంభించింది. రాత్రి 7గంటల దాటిన తర్వాత నిరంతరాయంగా 16గంటల పాటు ఉపవాసం చేయడం వంటివి చేసేది. ఎట్టకేలకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఆరు నెలల్లో 16కేజీల బరువు తగ్గింది. మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 40 మంది మహిళలు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో స్మితా రాయ్ విజేతగా నిలవగా, అంకిత ఫస్ట్ రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారని నిర్వాహకులు ఎండీ విజయ్ కాబ్రా, విద్యా కాబ్రా తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే రన్నరప్‌గా నిలిచి జైపూర్ వాసుల ప్రశంసలను అందుకుంది.

ఆ పని చేయకపోతే నీ వీడియోలు బయటపెడతా.. అంటూ హెచ్చరించిన భర్త.. ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..


అంకిత మాట్లాడుతూ మిస్ కేటగిరీలో పాల్గొనడం చాలా సులువని, అయితే మిసెస్ కేటగిరలో పాల్గొనాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే తనకు మాత్రం తన భర్త, అత్తమామలు అండగా నిలవడంతో సులువుగా విజయం సాధించగలిగానని చెప్పింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన మొదట్లో తన తల్లిదండ్రులు వద్దని చెప్పేవారని.. అయితే మొదటి సారి అవార్డు అందుకున్న తర్వాత అంతా ప్రోత్సహించారని గుర్తు చేసుకుంది. ‘‘నా కూతురిని చూసి గర్వపడుతున్నాను’’.. అని అంకిత తండ్రి దయాళ్ శరణ్ సక్సేనా తెలిపారు. వివాహానంతరం అనేక సమస్యలు ఎదురైనా, పట్టు వదలకుండా చివరకు అనుకున్న లక్ష్యానికి చేరుకున్న అంకితను ప్రస్తుతం జైపూర్ వాసులంతా ఆదర్శంగా తీసుకుంటున్నారు.

నాన్నా నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా... అంటూ ఆ తండ్రికి చెప్పిన 20 ఏళ్ల కూతురు.. చివరకు..

Updated Date - 2022-03-03T23:56:40+05:30 IST