Shamshabad airportలో భారీగా సిగరెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2022-07-30T16:15:47+05:30 IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి.

Shamshabad airportలో భారీగా సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad airport)లో భారీగా సిగరెట్లు (cigarettes) పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిన్న 6ఈ1406 విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సిగరెట్లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.  

Updated Date - 2022-07-30T16:15:47+05:30 IST