కరీంనగర్: గట్టుదుద్దేనపల్లి సహకార సంఘంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని మానకొండూర్ మండలంలో గల గట్టుదుద్దేనపల్లిలోని సహకార సంఘంలో మరోసారి అవినీతి జరిగింది. 1,500 క్వింటాళ్ల ధాన్యం మాయమయింది. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ అమ్మిన డబ్బులు జమచేయకుండానే జమ చేసినట్లు సంతకాలను ఫోర్జరీ చేశారు. రూ. 45 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. .