కరోనా నివారణకు ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-21T06:46:35+05:30 IST

కరోనాను నివారించేందుకు ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపట్టి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.

కరోనా నివారణకు ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

-  రాష్ట్ర వైద్య,ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు

పెద్దపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరోనాను నివారించేందుకు ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపట్టి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మం త్రి ఎరబెల్లి దయాకర్‌ రావు, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌తో కలిసి అన్ని జిల్లా ల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండడం తో అప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్‌ వేవ్‌లో నిర్వహించిన ఫీవర్‌ సర్వే ద్వారా చాలావరకు కరోనాను కట్టడి చేశామని, మంచి ఫలి తాలు వచ్చాయన్నారు.ప్రస్తుతం కూడా అదేవిధంగా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని సర్వే చేయాలన్నారు. ప్రతి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రి యను 100 శాతం పూర్తి చేయాలన్నారు. అవసరమైన వారికి బూస్టర్‌ డోస్‌ వేయాలన్నారు. మందుల కొరత, టెస్టింగ్‌ కిట్ల కొర త ఉంటే చెప్పాలని, వెంటనే పంపిస్తామన్నారు. ఇంటింటి సర్వే ద్వారా గుర్తించే కరోనా రోగులకు హోంఐసోలేషన్‌ కిట్లను అంద జేయాలన్నారు. కరోనా రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకునే లా పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాకేంద్రా ల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గర్భి ణులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఆశ, గ్రామపంచాయతీ, మున్సి పల్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని సేవలు అందించాల న్నారు. సీఎస్‌ మాట్లాడుతూ కోవిడ్‌ పరిహారానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ విచారణ జరిపి పరిహారం అందించాలన్నారు. జిల్లాలో 344 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, వైద్య, ఆరోగ్య, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి చేపట్టాల్సిన పలు సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డీపీఓ చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:46:35+05:30 IST