ముగ్గురిని మింగిన గుంత

ABN , First Publish Date - 2022-09-27T08:38:51+05:30 IST

ఈత సరదా ముగ్గురి ప్రాణాలను తీసింది.

ముగ్గురిని మింగిన గుంత

  • ఈతకు వెళ్లి చనిపోయిన చిన్నారులు
  • షాద్‌నగర్‌లోని సోలిపూర్‌లో విషాదం
  • అధికారుల నిర్లక్ష్యం వల్లే పిల్లలు మరణించారు
  • మునిసిపల్‌ చైర్మన్‌ను ఘెరావ్‌ చేసిన గ్రామస్థులు

షాద్‌నగర్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా ముగ్గురి ప్రాణాలను తీసింది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని సోలిపూర్‌ గ్రామానికి చెందిన చిన్నారులు అక్షిత్‌గౌడ్‌(8), ఫరీద్‌(12), సయిఫ్‌(7), మరో బాలుడు సంజయ్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆడుకుంటూ గ్రామ శివారులోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోకి వెళ్లారు. కొంతసేపు వెంచర్‌లో తిరిగి, సమీపంలో ఉన్న ఒక నీటిగుంత లోకి ఈతకు దిగారు. ముగ్గురు స్నేహితులు మునిగిపోవడాన్ని గమనించిన సంజ య్‌ కుమార్‌.. నీటి గుంతలోకి దిగి కాపాడేందుకు విఫల యత్నం చేశాడు. అనంతరం విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపాడు. చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్థులు వెంచర్‌కు చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు.  మునిసిపల్‌ అధికారులు సర్వీస్‌ రోడ్డు మరమ్మతు కోసం వెంచర్‌లో ఉన్న మట్టిని తరలించడం వల్లే అక్కడ గుంత ఏర్పడిందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మృతదేహాలతో షాద్‌నగర్‌ కూడలిలో ఆందోళన నిర్వహించారు. 

Updated Date - 2022-09-27T08:38:51+05:30 IST