పండుగ జోరు ఆఫర్ల హోరు

ABN , First Publish Date - 2020-10-31T06:30:01+05:30 IST

ఈ-కామర్స్‌ సైట్లలోపండగ షాపింగ్‌ ఇంకా కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లపై లభిస్తున్న వివిధ

పండుగ జోరు ఆఫర్ల హోరు

 ఈ-కామర్స్‌ సైట్లలోపండగ షాపింగ్‌ ఇంకా కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లపై లభిస్తున్న వివిధ ఆఫర్ల గురించి గతంలో చూశాం. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు,టాబ్లెట్లు వంటివివిధ ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువుల మీద లభిస్తున్న భారీ డిస్కౌంట్‌ గురించి ఇప్పుడు చూద్దాం.




బెస్ట్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌


15.6 అంగుళాల స్ర్కీన్‌ పరిమాణానికి తోడు ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 8 జిబి ర్యామ్‌, 4జిబి గ్రాఫిక్స్‌ కార్డు కలిగిన అద్భుతమైన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ HP Pavilion DK0268TXపై అమెజాన్‌లో 7500 రూపాయల డిస్కౌంట్‌ లభిస్తోంది. https://amzn.to/3e7Gk9b అనే లింక్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. విండోస్‌ 10 హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ దీంట్లో ఉంది. 512 జిబి ఎస్‌ఎస్‌డి లభిస్తున్నాయి. దీంతో విండోస్‌ బూటింగ్‌, అప్లికేషన్స్‌ చాలా వేగంగా ఓపెన్‌ అవుతాయి.




ఓల్టీ సపోర్ట్‌ బడ్జెట్‌ టాబ్లెట్‌


టాబ్లెట్‌ కొనుగోలు చేసేటప్పుడు అందులో వైఫై సదుపాయంతోపాటు 4జి ఓల్టీ సపోర్ట్‌ ఉంటే ఇంకా మంచిది. నిన్న మొన్నటి వరకు 21,500 రూపాయలకు లభించిన శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఏ 10.1లో వాయిస్‌ కాలింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంది. భారీగా 6000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ, 10.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే ఉంటాయి. 2 జిబి ర్యామ్‌, 32 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మాత్రమే ఉన్నప్పటికీ మెమరీ కార్డు ద్వారా అదనంగా స్టోరేజ్‌ పొందొచ్చు.https://amzn.to/34G3jozఅనే లింక్‌లో ఇది లభిస్తుంది.




హోమ్‌ థియేటర్‌ సెటప్‌


మీ దగ్గర పెద్ద స్ర్కీన్‌ పరిమాణం కలిగిన స్మార్ట్‌ టీవీ ఉన్నట్లయితే, ఇంట్లోనే హోమ్‌ థియేటర్‌ అనుభూతి పొందాలంటే మాత్రం కచ్చితంగా మంచి ఆడియో సెటప్‌ కావాలి. హోమ్‌ థియేటర్‌ పరికరాలను ఉత్పత్తి చేయటంలో పేరొందిన సోనీ సంస్థ 22,990 రూపాయల విలువ కలిగిన ‘హెచ్‌టి ఆర్‌టి 3’ 5.1 ఛానెల్‌ డాల్బి డిజిటల్‌ సౌండ్‌ బార్‌ని ప్రస్తుతం19,990 రూపాయలకే అందిస్తోంది. ఇది 600 వాట్స్‌ పవర్‌ అవుట్‌పుట్‌ అందిస్తుంది. https://amzn.to/31VaQOC అనే లింక్‌లో దీన్ని పొందొచ్చు.




కంప్యూటర్‌ మానిటర్‌


27 అంగుళాల వెడల్పాటి స్ర్కీన్‌ పరిమాణం కలిగి ఉండి, పెద్దగా అంచులు లేకుండా వీలైనంత ఎక్కువ స్ర్కీన్‌ ప్రదేశం లభించే ఎల్‌జి సంస్థకు చెందిన మానిటర్‌ గతంలో 20,999 రూపాయలకు లభించేది. ప్రస్తుతం దాన్ని కేవలం 18,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. రెండు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, స్పీకర్‌ సదుపాయం కూడా ఉన్నాయి. https://amzn.to/3kK7sxi అనే లింక్‌లో ఇది లభిస్తుంది.




డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా


ప్రముఖ కెమెరా తయారీ సంస్థ ‘కెనాన్‌’ అందిస్తున్న 1500డి డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా 30,990 రూపాయలు ఉండేది కాస్తా 6000 రూపాయల డిస్కౌంట్‌ పోను ప్రస్తుతం 24,990 రూపాయలకు లభిస్తోంది. వైఫై, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్‌ సదుపాయాలు ఉన్నాయి. డిజిక్‌ 4 ప్లస్‌ ఇమేజ్‌ ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేసే ఈ కెమెరా తక్కువ ధరలో మెరుగైనది కొనాలనుకునేవారికి అనుకూలంగా ఉంది.  https://amzn.to/2HQitPr లింక్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.




యాక్షన్‌ కెమెరా


ఇటీవలి కాలంలో యాక్షన్‌ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. అల్ర్టా వైడ్‌-యాంగిల్‌ సదుపాయం కలిగి ఉండి 4కె రిజల్యూషన్‌లో ఒక ముఖ్యమైన డీటెయిల్‌ కూడా మిస్‌ అవ్వకుండా రికార్డు చేయగలిగే సదుపాయం కలిగిన GoPro యాక్షన్‌ కెమెరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సంబంధించిన లేటెస్ట్‌ మోడల్‌ GoPro 8లో 12 మెగా పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఉంటుంది. 36,500 రూపాయల విలువ కలిగిన ఈ కెమెరాని ప్రస్తుతం కేవలం 30,990 రూపాయలకు https://amzn.to/3kGO0Sf ఈ లింక్‌లో సొంతం చేసుకోవచ్చు.




బెస్ట్‌ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌


ఆడియో పరికరాల రంగంలో జాబ్రా మంచి నాణ్యత కలిగిన వాటిని అందిస్తుంది. ఆ సంస్థ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన, 13,999 రూపాయల విలువ కలిగిన ‘జాబ్రా ఎలైట్‌ 65టి’ ఇయర్‌ బడ్స్‌ ప్రస్తుతం కేవలం 3,999 రూపాయలకే లభిస్తున్నాయి. ఛార్జింగ్‌ కేసుతో కలిపి గరిష్ఠంగా 15 గంటల బ్యాటరీ బ్యాకప్‌, వేరే ఎక్కడా లేని విధంగా ఏకంగా నాలుగు మైక్రోఫోన్లు, ఐపి55 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్స సపోర్ట్‌ని ఇవి కలిగి ఉంటాయి. https://amzn.to/ 2Ghg6Vi లింక్‌లో డిస్కౌంట్‌ కింద వీటిని కొనుగోలు చేయొచ్చు.




కన్వర్టబుల్‌ ల్యాప్‌టాప్‌


13.3 అంగుళాల పరిమాణం కలిగిన టచ్‌ స్ర్కీన్‌తో నచ్చిన విధంగా ఫోల్డ్‌ చేసే ఏ్క ఉుఽఠిడ ్ఠ360 అసలు ధర 95,990 రూపాయలు కాగా ప్రస్తుతం కేవలం 74,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. 8 జిబి ర్యామ్‌, 256 జిబి ఎస్‌ఎస్‌డి సదుపాయాలను ఇది కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 16 గంటల సేపు బ్యాటరీ లైఫ్‌ లభిస్తుంది. విండోస్‌ 10 హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టం దీంట్లో మనకు లభిస్తుంది. https:// amzn.to/2HM77vWఅనే లింక్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.




బడ్జెట్‌ సెక్యూరిటీ కెమెరా


ఇంట్లో భారీగా ఖర్చుపెట్టి సిసి కెమెరా సెటప్‌ చేసుకోవడం కష్టంగా ఉంటే ఫుల్‌ హెచ్‌డి రిజల్యూషన్‌ కలిగిన  Mi 360 Degree సెక్యూరిటీ కెమెరా ఎంపిక చేసుకోవచ్చు. 2,899 రూపాయల విలువ కలిగిన ఈ కెమెరా ప్రస్తుతం 2,299 రూపాయలకు మాత్రమే లభిస్తోంది. నైట్‌ విజన్‌ సదుపాయం ఉంది. 64 జీబీ మెమరీ కార్డు అమర్చుకుని వీడియో రికార్డు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓయస్‌ డివైజ్‌లపై దీనిని యాక్సెస్‌ చేయొచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా కదలికలను బట్టి అప్పటికప్పుడు రికార్డు చేసే వెసులుబాటు ఉంటుంది.https://amzn.to/31VJgkcలింక్‌లో ఇది లభిస్తుంది.




బ్లూటూత్‌ స్పీకర్స్‌


ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 24 గంటలు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తూ సోనీ సంస్థకు చెందిన ఖిఖఖిగీఆ33 వైర్లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్లు అసలు ధర రూ. 12,990 కాగా ప్రస్తుతం కేవలం 11,490 రూపాయలకు లభిస్తున్నాయి. ఇందులో వాటర్‌ ప్రూఫ్‌, డస్ట్‌ ప్రూఫ్‌, రస్ట్‌ ప్రూఫ్‌ సదుపాయాలు ఉన్నాయి. మైక్రోఫోన్‌ కూడా ఉండటంతో ఫోన్‌ కాల్స్‌ కూడా దీంట్లో చేసుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ ఈ సదుపాయాన్ని కూడా ఇది అందిస్తుంది. https://amzn.to/ 3oHBlRxలింక్‌లో దీన్ని పొందొచ్చు.




తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ వాచ్‌


నిన్నమొన్నటి వరకు 9999 రూపాయలకు అమ్మిన ‘అమేజ్‌ఫిట్‌ జిటిఎస్‌ స్మార్ట్‌ వాచ్‌’ ప్రస్తుతం 7,999 

రూపాయలకే లభిస్తోంది. 1.65 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ రక్షణ, 50 మీటర్ల లోతు వరకు నీటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 14 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుంది. 12 రకాల స్పోర్ట్స్‌ మోడ్‌లు, నిరంతరం హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ సదుపాయాలు దీంట్లో ఉంటాయి.https://amzn.to/35LAEhp అనే లింక్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.




నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2020-10-31T06:30:01+05:30 IST