దరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం

ABN , First Publish Date - 2021-06-22T06:50:20+05:30 IST

నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

దరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం
మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, జూన్‌ 21: నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం  స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుల సమావేశం కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి అధ్యక్షతన జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యుడు బతకలేని పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. నిత్యావసర ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 24న నిరసన కార్యక్రమాలు, 30న రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో హుజూరాబాద్‌ను జిల్లా చేయాలనుకుంటే అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌ సెక్యులర్‌, కమ్యునిజం భావజాలం అంటూ బీజేపీలో చేరారరన్నారు. బీజేపీలో తనకు ఎలాంటి ఆత్మాభిమానం దొరకుకుతుందో ముందు ముందు అర్థమవుతుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి, బలోపేతానికి పటిష్టమైన అవకాశాలున్న ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పార్టీ విస్తరణకు రాష్ట్ర సమితి సభ్యులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజించి చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో పార్టీ నాయకత్వం అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. ప్రజల మధ్య ఉంటే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించ వచ్చన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్‌, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మంద పవన్‌ బద్రి సత్యనారాయణ, తాండ్ర సదానందం, గుంటి వేణు, గడ్డం విలాస్‌రెడ్డి, కర్రె భిక్షపతి, మర్రి వెంకటస్వామి, కూన శోభారాణి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-22T06:50:20+05:30 IST