Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్‌.. వచ్చే నెలలో NASA ఏం చేయబోతోంది..?

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. అని చాలా సార్లు వింటూ ఉంటాం. చివరికి అది దిశ మార్చుకోవడమో, నాశనమవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరగకూడదు దేవుడా.. అనుకుంటూ అంతా పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థతే తలెత్తుతోంది. ఓ భారీ ఆస్టరాయిడ్.. భూమి వైపు దూసుకొస్తోంది. దీంతో దాన్ని  స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టి నాశనం చేసేందుకు.. నాసా (NASA) ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం డార్ట్‌(Double Asteroid Redirection Test mission) అనే మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

నవంబర్‌ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి.. గ్రహశకలాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అయితే వీరి స్పేస్‌ క్రాఫ్ట్ టార్గెట్‌ చేరుకోలేకపోతే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాసా సైంటిస్టులు మాత్రం దీనిపై దీమాగా ఉన్నారు. ఈ ఆస్టరాయిడ్‌ మూన్‌ను 1996లో ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన జోయ్‌ మోంటనీ మొదటగా గుర్తించారు.


అయితే ఈ ఆస్టరాయిడ్.. భూమిని ఎప్పుడు ఢీకొడుతుందో ఖచ్చితంగా తెలియకున్నా... ఒకవేళ ఢీకొడితే మాత్రం భారీ డ్యామేజీ తప్పదని సైంటిస్టులు భావిస్తున్నారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించారు. అయితే వీటిలో వెయ్యి మాత్రమే ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. వీరి ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement